
వండలూరు (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని జూపార్కులో ఓ తెల్లపులి అనారోగ్యంతో మరణించింది. చెన్నై సమీపంలోని వండలూర్ జంతుప్రదర్శనశాలలోని సెల్లో బుధవారం రాత్రి 13 ఏళ్ల తెల్లపులి మరణించింది. అరుదైన తెల్ల పులి అనారోగ్యంతో బాధపడుతోందని దీని అవయవాలు పూర్తిగా పక్షవాతానికి గురై మరణించిందని జూపార్కు అధికారులు చెప్పారు.తెల్ల పులి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిందని అధికారులు పేర్కొన్నారు. తెల్ల పులి మెదడు, నరాలు,కండరాలు దెబ్బతినడంతో బలహీనపడి మరణించింది. తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీ నిపుణులు పులి కళేబరానికి పోస్టుమార్టం చేశారు.
ఇవి కూడా చదవండి