Monkeypox: పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం!

ABN , First Publish Date - 2022-05-21T02:59:25+05:30 IST

కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో మంకీపాక్స్ వైరస్ కారణంగా మరోమారు కలకలం రేగుతోంది. అనేక దేశాల్లో ఈ వైరస్ కాలుపెట్టిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

Monkeypox:  పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం!

ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో మంకీపాక్స్ వైరస్ కారణంగా మరోమారు కలకలం రేగుతోంది. అనేక దేశాల్లో ఈ వైరస్ కాలుపెట్టిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మంకీపాక్స్ వ్యాప్తి, వ్యాధి తీవ్రత వంటి కీలక విషయాలపై చర్చించేందుకు డబ్ల్యూహెచ్ఓ ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఒకప్పుడు ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ వేసు ఇటీవల ఐరోపాలోనూ కాలుపెట్టింది. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాల్లో మంకీపాక్స్ తొలి కేసులు నమోదైనట్టు ఆయా దేశాలు ఇటీవలే ప్రకటించాయి. 


అంతకుమునుపు.. బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, స్వీడెన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాల్లోనూ మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. తాజాగా లెక్కల ప్రకారం.. ఐరోపా ఖండంలో ఇప్పటి వరకూ మొత్తం 100 మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే..  సాధారణ వైరల్ ఇన్ఫెక్షన స్థాయిలోనే మంకీపాక్స్ వ్యాధి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. దీని బారిన పడ్డ వారిలో జ్వరం, తలనొప్పి, స్కిన్ రాష్ కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే మంకీపాక్స్ పనిపట్టే టీకా ఏదీ అందుబాటులో లేదు.  



Updated Date - 2022-05-21T02:59:25+05:30 IST