భారత్ కొవిడ్ గణాంకాలపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ ఆందోళన

May 11 2021 @ 08:54AM

వాస్తవ సంఖ్యలు నివేదించాలని పిలుపు

జెనీవా : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి, మరణాల రేటు పెరగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, మరణాల రేటు తమకు ఆందోళన కలిగిస్తుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. కరోనా కేసుల సంఖ్య, మరణాలపై వాస్తవ సంఖ్యలను నివేదించాలని సౌమ్య స్వామినాథన్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇన్స్ ట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా ప్రకారం ఆగస్టు నాటికి ఒక మిలియన్ కరోనా మరణాలు సంభవించే అవకాశముందని సౌమ్య చెప్పారు.

 ప్రపంచంలోని ప్రతీ దేశం వాస్తవానికి అసలు కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను నిజమైన సంఖ్యకు తక్కువగా చెబుతోందని, దీంతో కరోనా వాస్తవ సంఖ్యలు, మరణాల రేటును తెలుసుకోవడానికి  తాము కసర్తు పెంచాలని నిర్ణయించినట్లు సౌమ్య చెప్పారు.ప్రజలు కొవిడ్ తోపాటు ఇతర అనారోగ్యాల వల్ల మరణిస్తున్నారని, వారు తగిన ఆరోగ్య సంరక్షణ పొందలేక పోతున్నారని డాక్టర్ సౌమ్య చెప్పారు. భారతదేశంలో సోమవారం కరోనా కేసుల సంఖ్య గరిష్ఠస్థాయికి చేరుకుందని, రెండవ అత్యధిక జనాభా ఉన్న భారత్ లో లాక్ డౌన్ చేయాలని డబ్ల్యూ హెచ్ వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య సూచించారు.  

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...