చాణక్య నీతి: మనిషిలోని ఈ చెడు అలవాట్లే తట్టుకోలేని ఇబ్బందులకు కారణం.. దరిద్రానికి మూలం!

ABN , First Publish Date - 2022-03-03T12:26:07+05:30 IST

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం...

చాణక్య నీతి: మనిషిలోని ఈ చెడు అలవాట్లే తట్టుకోలేని ఇబ్బందులకు కారణం.. దరిద్రానికి మూలం!

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలని కోరుకుంటాడు. తన లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తాడు. కష్టపడి పనిచేయడంలో విజయం దాగి ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం అపారంగా కురుస్తుంది. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలన్నా, సంపద దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నాఈ విషయాలను గుర్తుంచుకోవాలి. చాణక్యుడి ఈ మాటల్లో విజయం, సంపద రహస్యాలు దాగున్నాయి. చాణక్యుడు తెలిపిన ఆ అద్భుత సూత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


జ్ఞాన సముపార్జనకు వెనుకాడవద్దు: 

జ్ఞానంలోనే నిజమైన విజయం దాగి ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది. జ్ఞానం జీవితంలోని చీకటిని తరిమికొడుతుంది. జ్ఞానం అనేది జీవితంలో కొత్త అవకాశాలను అందించడమే కాకుండా, అవి నెరవేరేందుకు ప్రేరణను కల్పిస్తుంది. జ్ఞాన సముపార్జన చేయనివారు జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. అయితే దీనిని  గుర్తించి, జ్ఞానసాధనలో నిమగ్నమై ఉన్నవారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. సంపదలకు దేవత అయిన లక్షీదేవి అటువంటి వారిని అనుగ్రహిస్తుంది.

చెడు సావాసానికి దూరంగా ఉండండి: 

విజయ సాధనలో సాంగత్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చాణక్య నీతి చెబుతుంది. మంచి సాంగత్యం ఉన్నప్పుడు అతని చుట్టూ జ్ఞానవంతులు, నేర్చుకునేవారు, నైపుణ్యం కలిగినవారు ఉంటారు. అప్పుడు అతని విజయాన్ని ఎవరూ ఆపలేరు. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాంటివారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.

అహంకారం వద్దు: 

అహంకారమే పతనానికి కారణమని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది. అందుకే అహంకారానికి దూరంగా ఉండాలి.  ఏదో కొద్దిపాటి విజయం సాధించి, ఇతరుల కంటే తమను తాము గొప్పవారిగా భావించి, ఎదుటివారిని తక్కువగా అంచనా వేసే వారు భవిష్యత్తులో భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాంటి వారికి శత్రువులు అధికమవుతారు. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మనిషికి అహంకారం ఉండకూడదు. ఇది మనిషికి ఉండే లోపాలలో ఒకటి. అహంకారంతో మిడిసిపడే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.

Updated Date - 2022-03-03T12:26:07+05:30 IST