Ranveer Singh కాదు.. Deepika Padukone అభిమాన నటుడు ఎవరో తెలుసా..? టాలీవుడ్ టాప్ హీరోనే..!

Published: Tue, 12 Oct 2021 16:07:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Ranveer Singh కాదు.. Deepika Padukone అభిమాన నటుడు ఎవరో తెలుసా..? టాలీవుడ్ టాప్ హీరోనే..!

బాలీవుడ్‌లోని చూడ చక్కని జంటల్లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే జంట ఒకటి. వివాహం తర్వాత కూడా ఇద్దరూ కెరీర్‌పైనే దృష్టి సారించి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇద్దరూ రోజులో కొంత సమయం కలిసి గడుపుతారు. సందర్భం కుదిరినపుడు ఒకరిపై మరొకరు తమ ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరుస్తుంటారు. వెండితెర మీద కూడా ఈ ఇద్దరి కెమిస్ట్రీ చాలా చక్కగా ఉంటుంది. 

ఎంతో మంది ప్రముఖ హీరోలతో కలిసి నటించిన దీపికకు ఇష్టమైన నటుడు ఎవరు? ఈ ప్రశ్నకు కొద్ది రోజుల కిందట దీపిక ఓ కార్యక్రమంలో సమాధానం చెప్పింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని చెప్పింది. తాను మహేష్ బాబును ప్రత్యక్షంగా కలవలేదని, అయితే ఆయన నటన తనకు నచ్చుతుందని దీపిక తెలిపింది. రణ్‌వీర్ పేరు కాకుండా మహేష్ పేరు చెప్పడంతో అక్కడున్న అందరూ గట్టిగా నవ్వేశారు. దీపిక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  


 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...