ఎవరీ Gautam Hathiramani.. బాలీవుడ్ సింగర్ Kanika Kapoor పెళ్లి చేసుకోబోతున్న ఈ NRI ఎవరంటే..

ABN , First Publish Date - 2022-05-21T01:02:18+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ త్వరలో తన ఎన్నారై ప్రియుడిని పెళ్లాడనున్నారు. ఇటీవల ఆమె తనకు కాబోయే భర్తతో కలిసి లండన్‌లో జరుపుకున్న ప్రీ వెడ్డింగ్ పార్టీ తాలూకు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎవరీ Gautam Hathiramani.. బాలీవుడ్ సింగర్ Kanika Kapoor పెళ్లి చేసుకోబోతున్న ఈ NRI ఎవరంటే..

ఎన్నారై డెస్క్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ త్వరలో తన ఎన్నారై ప్రియుడిని పెళ్లాడనున్నారు. ఇటీవల ఆమె తనకు కాబోయే భర్తతో కలిసి లండన్‌లో జరుపుకున్న ప్రీ వెడ్డింగ్ పార్టీ తాలూకు చిత్రాలు ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి. కనికా  కపూర్‌ మనసు గెలుచుకున్న ఎన్నారై పేరు గౌతమ్ హతీరామని(Gautam Hathiramani). లండన్‌కు చెందిన గౌతమ్.. డానా గ్రూప్‌లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. డానా గ్రూప్ సంస్థలు.. ఏవియేషన్, ఆటోమొబైల్స్, హెల్త్, మాన్యూఫాక్చరింగ్ వంటి విభిన్న రంగాలకు విస్తరించింది. 


నైజీరియాలో జన్మించిన గౌతమ్ యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టా పొందారు. కాలేజీ కరిక్యూలమ్‌లో భాగంగా ఇటాలియన్ భాషను కూడా అభ్యసించారు.  2006లో ఆయన డానా ఎయిర్ సంస్థ  బోర్డ్ ఆఫ్ డెరెక్టర్స్‌లో చేరారు. కాగా.. కనికకు ఇది రెండో వివాహం. 18 ఏళ్ల వయసున్నప్పుడే ఆమెకు రాజ్ చందోక్ అనే మరో ఎన్నారైతో వివాహం జరిగింది. కానీ.. 2012లో వారు విడిపోయారు. ఆ తరువాత కనికా లక్నోలో తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. కనికకు ముగ్గురు పిల్లలు. ఇక తాజాగా జరిగిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో వధూవరులిద్దరూ సంప్రదాయిక దుస్తుల్లో మెరిసిపోయారు. పాస్టల్ గ్రీన్ లెహెంగాలో కనికా మెరిసిపోగా.. కుర్తాపైజామా ధరించిన గౌతమ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. 



Updated Date - 2022-05-21T01:02:18+05:30 IST