‘ఒక్కడు 2’... హీరో ఎవరు?

Published: Mon, 08 Aug 2022 00:40:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒక్కడు 2... హీరో ఎవరు?

మహేశ్‌బాబు కెరీర్‌ని అమాంతంగా మార్చేసిన సినిమా ‘ఒక్కడు’. గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రానికి ఎమ్మెస్‌ రాజు నిర్మాత. ఆయనే స్ర్కీన్‌ ప్లే కూడా అందించారు. మహేశ్‌తో మరో సినిమా చేస్తే అది ‘ఒక్కడు 2’ అవ్వాలన్నది ఆయన ఆలోచన. అందుకు తగినట్టుగానే స్ర్కిప్టుని తయారు చేసుకొన్నారు. అయితే ఇప్పుడు మహేశ్‌ కాల్షీట్లు దొరకడం ఎంత కష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో సినిమా చేయాలంటే మరో మూడేళ్లయినా ఆగాలి. అందుకే ఎమ్మెస్‌ రాజు ప్లాన్‌ మారింది. ఆయన ‘ఒక్కడు 2’ని మహేశ్‌తో కాకుండా మరో హీరోతో తెరకెక్కించడానికి రెడీ అయిపోయారని టాక్‌. ప్రస్తుతం ఓ అగ్ర కథానాయకుడితో ఎమ్మెస్‌ రాజు సంప్రదింపులు జరుపుతున్నారని త్వరలోనే ‘ఒక్కడు 2’కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి మహేశ్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆ కథానాయకుడు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International