ఏడు రోజుల్లో 20 లక్షల కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-09-23T02:26:19+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో దాదాపు 20 లక్షల కరోనా కేసులు

ఏడు రోజుల్లో 20 లక్షల కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో దాదాపు 20 లక్షల కరోనా కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి వారం వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు దాదాపు 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని.. అంతకు ముందు వారంతో పోల్చితే కరోనా కేసుల సంఖ్య ఆరు శాతం పెరిగిందని చెప్పింది. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మాత్రం పది శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 


గడిచిన వారం రోజుల్లో కరోనా కారణంగా 36,764 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారని.. అంతకుముందు వారంతో పోల్చితే ఇది పది శాతం తక్కువని పేర్కొంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 కోట్ల 15 లక్షల 55 వేల 356 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తం 9,70,616 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా తరువాతి నాలుగు స్థానాల్లో భారత్, బ్రెజిల్, రష్యా, పెరూ దేశాలున్నాయి. 

Updated Date - 2020-09-23T02:26:19+05:30 IST