Palestineలో భారత రాయబారి ముకుల్ ఆర్య హఠాన్మరణం

ABN , First Publish Date - 2022-03-07T17:22:02+05:30 IST

పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్‌ ఆర్య హఠాన్మరణం చెందారు...

Palestineలో భారత రాయబారి ముకుల్ ఆర్య హఠాన్మరణం

న్యూఢిల్లీ: పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్‌ ఆర్య హఠాన్మరణం చెందారు.దివంగత రాయబారి అయిన ఆర్య పారిస్‌లోని యునెస్కోకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందంలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆర్య గతంలో మాస్కో, కాబూల్‌లలో భారత రాయబారిగా, న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో విదేశీ అధికారిగా పనిచేశారు.ఈయన ప్రతిష్ఠాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరడానికి ముందు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కూడా అభ్యసించాడని పాలస్తీనా దేశంలోని రమల్లాలోని భారత ప్రతినిధి కార్యాలయం పేర్కొంది.


ముకుల్ ఆర్య ఆకస్మిక మరణానికి కారణం ఇంకా తెలియనప్పటికీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అతని మరణానికి సంతాపం తెలుపుతూ ట్విట్ చేశారు.ముకుల్ ఆర్య తన కార్యాలయంలో మరణించడం పట్ల పాలస్తీనా అగ్ర నాయకత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ముకుల్ ఆర్య పార్థివదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేపట్టేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో అధికారిక సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.


Updated Date - 2022-03-07T17:22:02+05:30 IST