అగ్నివీరులకు పిల్లనెవరిస్తారు?: గవర్నర్ సూటి ప్రశ్న

Published: Tue, 28 Jun 2022 15:17:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అగ్నివీరులకు పిల్లనెవరిస్తారు?: గవర్నర్ సూటి ప్రశ్న

షిల్లాంగ్: అగ్నిపథ్ పథకంపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్లు కొనసాగుతున్నాయి. తాజాగా, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సైతం ఈ ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. అగ్నివీరులు పెన్షన్ లేకుండా రిటైర్ అయితే వారిని ఎవరు పెళ్లాడతారంటూ ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

''దేశ యువత ప్రయోజనాలకు తగ్గట్టుగా అగ్నిపథ్ పథకం లేదు. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి, గ్రామానికి మధ్య దూరం పెరుగుతుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఒక గవర్నర్ ముందుకు రావడం ఇదే మొదటిసారి. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన ఈ పథకాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సైతం వ్యతిరేకించాయి. నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ సైతం అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గళం విప్పింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.