మద్యం పాలసీని ఎందుకు మార్చారు: అచ్చెన్నాయుడు

Published: Wed, 23 Mar 2022 17:34:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మద్యం పాలసీని ఎందుకు మార్చారు:  అచ్చెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలో మద్యం పాలసీని ఎందుకు మార్చారని ప్రభుత్వాన్ని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 27 మంది చనిపోయారని వారి కుటుంబసభ్యులే చెప్పారని ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాము సీఎంను కోరామన్నారు. నాటుసారా అంశంపై అసెంబ్లీలో చర్చించాలని అడిగామన్నారు. నాటుసారా మరణాలను సహజ మరణాలుగా సభలో సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ అడిగినందుకే టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు నోటితో భజన చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తమకు మైక్‌ ఇవ్వనందునే బయటకు వచ్చామని ఆయన తెలిపారు. 


గతంలో నచ్చిన బ్రాండ్‌ కొనుక్కునే స్వేచ్ఛ ఉండేదన్నారు. కానీ నేడు రేటు చెప్పి మద్యం అడగాల్సిన దుస్థితికి తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత బ్రాండ్లు చంద్రబాబు తెచ్చారని అబద్ధాలు చెప్పారన్నారు. తమ హయాంలో మద్యం బ్రాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నించారా అని ఆయన నిలదీశారు. మద్యం పాలసీ మార్చి.. దుకాణాలు తీసుకోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రతి మద్యం దుకాణంలో 10 సీసాలు తీసుకుని తనిఖీలు చేయిద్దామని, మద్యంలో ఎంత హానికర రసాయనాలు ఉన్నాయో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. మద్యం కొనుక్కోలేకే నాటుసారా తాగారని అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. మరణాలపై జ్యుడీషియల్‌ విచారణకు ఎందుకు భయమని ఆయన ప్రశ్నించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.