Chiru Pawan: అన్నకు అగ్రతాంబూలం.. తమ్ముడికి అందని ఆహ్వానం.. ఇదేనా అసలు కారణం..?

Published: Mon, 04 Jul 2022 16:31:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Chiru Pawan: అన్నకు అగ్రతాంబూలం.. తమ్ముడికి అందని ఆహ్వానం.. ఇదేనా అసలు కారణం..?

ఏపీలో (AP) బీజేపీకి(BJP), జనసేనకు (Janasena) మధ్య రాజకీయంగా దూరం పెరిగిందా..? అయినవాళ్లకి ఆకుల్లో... కానివాళ్లకి కంచాల్లో అన్నట్టు- తమ్ముడు పవన్ (Pawan) కంటే అన్నయ్య చిరంజీవే (Chiranjeevi) బీజేపీకి ఎక్కువైపోయాడా..? మెగాస్టార్‌ను (Megastar) తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ (BJP) ఉవ్విళ్లూరుతోందా..? అందులో భాగంగానే చిరంజీవిని ప్రధాని మోదీ (PM Modi) పాల్గొనే సభకు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆహ్వానించారా..? రాజకీయంగా కలిసి అడుగులేస్తున్న బీజేపీ, జనసేన బంధం (BJP Janasena) బీటలు వారిందా..? బీజేపీ (BJP) రూట్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్న పవన్‌కు (Pawan Kalyan) అవమానం జరిగిందా..? ఏపీ రాజకీయ వర్గాల్లో తాజాగా తలెత్తిన ప్రశ్నలివి. ఈ ప్రశ్నలపై ఏపీలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. అందుకు కారణం తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే. అసలు ఇంతకీ విషయం ఏంటంటే.. మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు (Alluri) 125వ జయంతి సందర్భంగా భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆవిష్కరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy), కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy), ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju), ఏపీ మంత్రి రోజాతో (AP Minister Roja) పాటు కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి (Actor Chiranjeevi) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి (Chiranjeevi) ఇటు బీజేపీలోనూ (BJP) లేరు, అటు అధికార వైసీపీలోనూ (YCP) లేరు.


రాజకీయాలకు దూరంగా ఉంటూ తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి చిరంజీవిని (Chiranjeevi) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆహ్వానం మేరకు చిరు (Chiru) రావడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. చిరంజీవిని బీజేపీలో చేర్చుకుంటే బాగుంటుందనే ఆలోచనలో భాగంగానే ఈ ఆహ్వానం అందినట్టు సమాచారం. అయితే.. అన్నయ్యను దగ్గర చేసుకునే క్రమంలో తమ్ముడిని బీజేపీ (BJP) ఎందుకు దూరం పెడుతుందనే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అల్లూరి విగ్రహావిష్కరణ (Alluri Statue) కార్యక్రమానికి చిరంజీవికి (Chiranjeevi) అందిన ఆహ్వానం తమ్ముడు పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) అందలేదని సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని పిలిచి రాజకీయంగా తమతో కలిసి నడుస్తున్న పవన్‌ను ఎందుకు పిలవలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జనసేన (Janasena), బీజేపీ (BJP) రాజకీయంగా కలిసి ముందుకెళుతున్న సంగతి తెలిసిందే.


తిరుపతి (Tirupati) ఉప ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బహిరంగ సభలో పాల్గొని మరీ గెలిపించాలని కోరారు. అయితే అదే పవన్ కల్యాణ్ ఆత్మకూరు ఉప ఎన్నికను (Atmakur By Election) మాత్రం లైట్ తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో ఒక్క జనసేన జెండా కూడా ఎగరలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ‘గోదావరి గర్జన’ (Godavari Gharjana) పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కూడా పవన్‌కు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలు బీజేపీ, జనసేన మధ్య రాజకీయంగా దూరం పెరిగిందనే అనుమానాలకు తావిచ్చాయి. తాజాగా.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్‌కు ఆహ్వానం అందకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంగా గ్యాప్ పెరిగిందనే వాదనకు బలం చేకూర్చింది. పైగా.. చిరంజీవిని దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. రాజకీయాలకు అతీతంగా అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ వేదికపై ఉన్న వారంతా బీజేపీ, వైసీపీ నేతలే కావడం గమనార్హం. ప్రతిపక్ష టీడీపీకి కనీస మర్యాద కూడా దక్కకపోవడం ఆ కార్యక్రమం ఎలా సాగిందో చెప్పేందుకు నిదర్శనమని టీడీపీ నేతలు ఆరోపించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.