ఇంత చిన్న చిరపుంజిలో అంత అత్యధిక వర్షాలు ఎందుకు కురుస్తాయో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-09T15:34:46+05:30 IST

మన దేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రదేశాల..

ఇంత చిన్న చిరపుంజిలో అంత అత్యధిక వర్షాలు ఎందుకు కురుస్తాయో తెలుసా?

మన దేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రదేశాల గురించి ప్రస్తావనకు వస్తే.. ముందుగా మేఘాలయలోని చిరపుంజి, మాసిన్రామ్ ప్రాంతాలు గుర్తుకువస్తాయి. ఈ రెండు నగరాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలుగా ఇవి చోటు సంపాదించుకున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు కురవడానికి కారణమేమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిరపుంజి, మాసిన్రామ్‌లలో వర్షాలు పోటీపడి కురుస్తుంటాయంటారు. అలాగే కొన్నిసార్లు ఒక నగరంలో అధిక వర్షాలు కురిస్తే, మరికొన్నిసార్లు మరొక నగరంలో అధిక వర్షాలు కురుస్తాయి. 


ఈ రెండు నగరాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. చిరపుంజి ఈశాన్య ప్రాంతంలోని ఒక చిన్ననగరం. ఇక్కడ అధికంగా వర్షాలు కురుస్తాయి. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. అత్యధిక వర్షపాతం కారణంగా చిరపుంజి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం తగ్గుముఖం పట్టిందని, ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడ వర్షపాతం గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చిరపుంజికి కేవలం 81 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసిన్రామ్‌లో కూడా  అత్యధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఇక్కడ అధికంగా వర్షాలు ఎందుకు కురుస్తాయో తెలుసుకోవాలంటే.. అక్కడి భౌగోళిక స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ రెండు ప్రదేశాలు మేఘాలయలోని ఖాసీ కొండలపై ఉన్నాయి. ఈ కొండలు 1,500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సముద్ర మట్టానికి చిరపుంజి 1,313 మీటర్ల ఎత్తులో ఉండగా, మసిన్నామ్ 1,401.5 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతాలకు మూడు వైపులా ఖాసీ కొండ ఉంది. ఈ కారణాలతోనే ఇక్కడ వర్షపాతం అధికంగా నమోదవుతుంటుంది. ఇక్కడి కొండలు.. మేఘాలను అడ్డుకోవడంతో ఈ ప్రాంతాలలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు మేఘాలను తీసుకువచ్చినప్పుడు, ఈ గాలులు ఖాసీ కొండను తాకుతాయి ఫలితంగా నిరంతరం వర్షాలు కురుస్తుంటాయి.

Updated Date - 2022-01-09T15:34:46+05:30 IST