ఆకాశంలోని మేఘాల రంగుల రహస్యం ఇదే..

ABN , First Publish Date - 2022-05-30T12:50:46+05:30 IST

వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై ఆ తర్వాత...

ఆకాశంలోని మేఘాల రంగుల రహస్యం ఇదే..

వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై ఆ తర్వాత బిందువుల రూపంలో వర్షం పడటాన్ని మనం తరచూ చూస్తుంటాం. వర్షం కురవకముందు ఆకాశం వైపు చూస్తే నల్లటి మేఘాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ మేఘాలు తెలుపు రంగులోనూ కనిపిస్తాయి. ఇలా ఎందుకు కనిపిస్తాయో మీకు తెలుసా? దీని గురించి సైన్స్ ఏమి చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న నీటి ఆవిరి బిందువుల నుంచి మేఘాలు ఏర్పడుతాయనే విషయం మనకు తెలిసిందే. భూమిపై సూర్యుని వేడి కారణంగా నదులు, సముద్రాలు, ఇతర నీటి వనరులు వేడెక్కి, వాటిలోని నీరు ఆవిరి రూపంలో పైకి చేరుతుంది. 


ఆ సమయంలో పైన ఉన్న స్వల్ప ఉష్ణోగ్రత కారణంగా ఈ నీటి ఆవిరి ఘనీభవించి పెద్ద మంచు ముక్కగా మారుతుంది. తద్వారా మేఘం ఏర్పడుతుంది. ఈ మేఘాలను మనం భూమి నుండి చూడవచ్చు. అయితే మేఘాలు తెల్లగా కనిపించడానికి ప్రత్యేక కారణం ఉంది. తెల్లటి మేఘాలు ఏ రంగును గ్రహించవు. దేనినీ ప్రతిబింబించవు. ఆకాశంలో నల్లగా కనిపించే మేఘాలు చాలా దట్టంగా ఉంటాయి. నల్లటి మేఘాలు కనిపించడానికి కారణం రంగులకు సంబంధించిన సిద్ధాంతమే. దట్టమైన మేఘాలు సూర్యుని కాంతి కిరణాలను గ్రహిస్తాయి. ఈ కారణంగానే మనకు ఈ మేఘాలు భూమి నుండి నల్లగా కనిపిస్తాయి.

Updated Date - 2022-05-30T12:50:46+05:30 IST