భారీ భూకంపం రాలేదు.. కానీ గోడలకు పగుళ్లు.. ఎందుకలా?

ABN , First Publish Date - 2022-05-05T17:45:26+05:30 IST

ఇళ్లలో పైకప్పులకు, పక్క గోడలకు పగుళ్లు ఏర్పడటాన్ని..

భారీ భూకంపం రాలేదు.. కానీ గోడలకు పగుళ్లు.. ఎందుకలా?

ఇళ్లలో పైకప్పులకు, పక్క గోడలకు పగుళ్లు ఏర్పడటాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి భూకంపంతో సంబంధం లేకపోయినా ఎందుకిలా జరుగుతుందో తెలుసా? ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడటానికి పలు కారణాలున్నాయి.  ఉదాహరణకు వాతావరణ ప్రభావం వల్ల కూడా ఇలా జరగవచ్చు. వర్షం పడినప్పుడు, చెక్క వస్తువులు ఉబ్బుతాయి. ఇది ఇంటి గోడలపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా, తలుపుల అంచుల నుండి పగుళ్లు ఏర్పడతాయి. 


కొన్నిసార్లు పైకప్పుల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇది జరగడానికి మరొక కారణం బలమైన కారణం కూడా ఉంది. అదే బలమైన గాలి లేదా తుఫాను. ఇటువంటి పరిస్థితుల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కిటికీలు వాటిపక్క గోడలను ఢీకొంటాయి. తేమ కారణంగా చెక్క ఫర్నిచర్ పరిమాణం పెరుగుతుంది. ఇవన్నీ గోడలకు ఆనుకుని ఉండటం వల్ల వాతావరణ ప్రభావం పగుళ్ల రూపంలో కనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు కొన్నిసార్లు ఇంటి పక్కనున్న చెట్ల కొమ్మలు విరిగిపోవడం వల్ల లోపలి గోడ లేదా పైకప్పుకు పగుళ్లు ఏర్పడవచ్చు. ఇంతేకాకుండా ఎడతెగని వర్షం చిన్నచిన్న పగుళ్లను పెంచడానికి దారితీస్తుంది. అందుకే ఇంట్లో గోడలకు పగుళ్లు ఏర్పడితే దానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంటి పక్కన పెద్ద చెట్లు ఉంటే, దాని మూలాలు చాలా బలంగా ఉంటాయి. అవి నేలలో విస్తరించినప్పుడు గోడ నుంచి పైకప్పు వరకు పగుళ్లు ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే గోడపై పగుళ్లకు కారణం భూకంపం అని అనుకోనవసరంలేదు. 


Read more