కుక్కలు.. పిల్లులను ఎందుకు ఇష్టపడవో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-05-05T16:32:03+05:30 IST

కుక్క..పిల్లి ఈ రెండూ ఇళ్లలో తిరిగే పెంపుడు జంతువులే..

కుక్కలు.. పిల్లులను ఎందుకు ఇష్టపడవో తెలిస్తే...

కుక్క..పిల్లి ఈ రెండూ ఇళ్లలో తిరిగే పెంపుడు జంతువులే.. అయితే వీటి మధ్య స్నేహం అంతగా కనిపించదు. చాలా సందర్భాలలో కుక్కలు... పిల్లులపై కోపగిస్తూ వాటిని పరిగెత్తించడం చూస్తుంటాం. వీటి మధ్య ఈ శత్రుత్వం ఎందుకు ఏర్పడిందో తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.  గార్డియన్ నివేదిక ప్రకారం పిల్లులు కూడా కుక్కలను ఇష్టపడవు. ఈ రెండూ ఒకదానిని మరొకటి ఇష్టపడకపోవడానికి కారణం వాటి స్వభావమే. 


కుక్క సమూహంలో ఉండటానికి ఇష్టపడుతుంది. అయితే పిల్లి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. ఒక పిల్లి ఇతర పిల్లులను ఎప్పుడూ తన వెంట తీసుకెళ్లదు. అవి ఒకదానినొకటి ఇష్టపడకపోవడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  కుక్క.. పిల్లిని తొలిసారి చూసినప్పుడు, దానితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా అది పిల్లి దగ్గరికు వచ్చి దాని శరీరాన్ని వాసన చూడడానికి ప్రయత్నిస్తుంది. ఇది పిల్లికి ఎంతమాత్రం నచ్చదు. ఈ సమయంలో కుక్కలు దానితో స్నేహం చేసేందుకు తోక ఊపడం ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి, అయితే పిల్లుల ప్రవర్తన ప్రకారం తోక ఊపడం అంటే కోపం తెచ్చుకోవడం. ఇలా వాటి ప్రవర్తనే వాటి కోపానికి కారణంగా నిలుస్తుంది. కుక్క స్నేహాన్ని కోరుతూ పిల్లి దగ్గరకు వచ్చినప్పుడు అది దానిని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి అనుభవం తర్వాత కుక్క.. పిల్లి ఒకదానికొకటి అయిష్టతను పెంచుతాయి. అయితే ఒకే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క, పిల్లుల మధ్య స్నేహం వాటి కారణంగా జరుగుతుంటుంది. 


Read more