Fearfull memories: గతంలో జరిగిపోయిన చేదు సంఘటనలు.. పదే పదే ఎందుకు గుర్తుకు వస్తాయంటే..

ABN , First Publish Date - 2022-09-08T18:53:32+05:30 IST

గతంలో జరిగిన దుర్ఘటనలు, గతానికి సంబంధించిన చేదు గురుతులు ఎందుకు గుర్తుకు వస్తూ ఉంటాయి..?

Fearfull memories: గతంలో జరిగిపోయిన చేదు సంఘటనలు.. పదే పదే ఎందుకు గుర్తుకు వస్తాయంటే..

ప్రముఖ దర్శకుడు ఎస్వీ క్రిష్ణారెడ్డి హీరోగా నటించిన అభిషేకం సినిమాను చూశారా..? అందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. సినిమా గురించి కాదు కానీ.. ఆ సినిమాలో ఎస్వీ క్రిష్ణారెడ్డికి ఓ భయంకరమైన కల వస్తూ ఉంటుంది. పదే పదే చిన్నప్పటి నుంచి అదే కల వస్తూ ఉంటుంది. ఆ కలనే గుర్తుకు తెచ్చుకుంటూ ఆ హీరో బాధపడుతూ ఉంటాడు. అచ్చం అలాగే చాలా మంది తమ జీవితంలో జరిగిన తీపి గుర్తులకు బదులు.. ఎప్పుడో జరిగిపోయిన దుర్ఘటనలనే గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా సరే గతంలో వచ్చిన కష్టాలను తలచుకుంటూ నాకే ఎందుకీ కష్టాలు అంటూ శోకంలో మునిగిపోతారు. ప్రతీరోజూ ఎన్నో సందర్భాల్లో సంతోషపడే సంఘటనలు జరిగుతూ ఉంటాయి. కానీ అదే సమయంలో గతంలో జరిగిపోయిన బాధపడే సంఘటనలను రోజుకు ఒక్కసారి అయినా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు.

అసలు ఇలా ఎందుకు జరుగుతుంది.?గతంలో జరిగిన దుర్ఘటనలు, గతానికి సంబంధించిన చేదు గురుతులు ఎందుకు గుర్తుకు వస్తూ ఉంటాయి..? అన్నదానికి ఎట్టకేలకు సమాధానం దొరికిపోయింది. 


ఎందుకిలా జరుగుతుంది

బాధాకరమైన జ్ఞాపకాలు ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయం గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినపుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మనిషి మెదడులో బావోద్వేగాలకు ఒక కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకాన్ని అమిగ్డాలా అని అంటారు. ఈ అమిగ్డాలా బాదం ఆకారంలో నరాలతో నిర్మాణమై ఉంటుంది. ఇది మెదడులో ఉండే హైపోథ్లస్, హిప్పోకాంపస్, జింగ్యులేట్ గైరస్ మొదలైన వాటికి దగ్గరగా ఉంటుంది. భావోద్వేగాలు ప్రేరణ జరిగి వాటి ప్రవర్తనలో మార్పులొచ్చేది ఇక్కడే. 

మనుషులు బాధపడే సంధర్భాలు ఎదుర్కున్నపుడు ఒత్తిడికి గురవుతారు ఆ సమయంలో న్యూరోట్రాన్స్ మీటర్ ల వేగం పెరుగుతుంది.  నోర్ ఫైన్ ప్రైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మెదడులో విద్యుత్ తరంగాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో నరాలు ప్రేరణకు గురవుతాయి.  ఈ ప్రేరణ జరిగినపుడు  జరిగిన సంఘటనలు పదేపదే రిపీటెడ్ గా రికార్డ్ అవుతుంది. దీనివల్ల మెదడులో బాధాకర సంఘటనలు అన్నీ చాలా బలంగా నిక్షిప్తం అయిపోతాయి.  సంతోషకర సంఘటనలు జరిగినపుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు, చాలా ముఖ్యమైన విషయాలలో  మాత్రమే ఒత్తిడి ఎదుర్కుంటాము. ఉదాహరణకు ఉద్యోగం, పెళ్ళి వంటి జీవితకాల సంఘటనలు. కానీ బాధపడే అన్ని సందర్భాలలో ఒత్తిడి ఉంటుంది.. అందుకే ఇలా జరుతుంది.

Updated Date - 2022-09-08T18:53:32+05:30 IST