టూత్‌పిక్‌ చివర అలాంటి డిజైన్ ఎందుకు ఉంటుందంటే..

ABN , First Publish Date - 2022-07-06T15:33:17+05:30 IST

లంచ్ లేదా డిన్నర్ తర్వాత చాలామంది...

టూత్‌పిక్‌ చివర అలాంటి డిజైన్ ఎందుకు ఉంటుందంటే..

లంచ్ లేదా డిన్నర్ తర్వాత చాలామంది తమ పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం ముక్కలను తొలగించేందుకు టూత్‌పిక్‌లను ఉపయోగిస్తారు. అయితే టూత్‌పిక్ చివరిలో ఈ డిజైన్ ఎందుకు ఉంటుందో తెలుసా? దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రకమైన టూత్‌పిక్‌ని జపనీస్ టూత్‌పిక్ అని కూడా అంటారు. ఈ డిజైన్ రూపకల్పన వెనుక వ్యాధుల నివారణ ఉద్దేశంగా ఉంది. 


ఈ డిజైన్ కారణంగా ఈ టూత్‌పిక్‌ని ఉపయోగించిన తరువాత అది విరిగిపోతుంది. అప్పుడు దానిని తిరిగి ఉపయోగించలేరు. ఇలా చేయడం వలన అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి పైయోరియా లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నాడని అనుకుందాం. అతను ఈ టూత్‌పిక్‌ని ఉపయోగిస్తే వ్యాధి ప్రభలే ప్రమాదం ఉంది. వీటిని నివారించేందుకే టూత్‌పిక్ వెనుక భాగంలో ఇటువంటి డిజైన్ చేస్తారు. 

Updated Date - 2022-07-06T15:33:17+05:30 IST