అమెరికాను మించిపోతున్న UAE.. Dubaiకు క్యూకడుతున్న భారతీయులు.. !

ABN , First Publish Date - 2022-06-18T01:42:18+05:30 IST

సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలకు వ్యాపారవేత్తలు పట్టం కడతారు. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు, వ్యాపారవేత్తలందరూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, స్విట్జర్‌ల్యాండ్ వంటి దేశాలకు తరలివెళుతుంటారు. అయితే..

అమెరికాను మించిపోతున్న UAE.. Dubaiకు క్యూకడుతున్న భారతీయులు.. !

ఎన్నారై డెస్క్: సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలకు వ్యాపారవేత్తలు పట్టం కడతారు. అందుకే..  ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు, వ్యాపారవేత్తలందరూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, స్విట్జర్‌ల్యాండ్ వంటి దేశాలకు తరలివెళుతుంటారు. అయితే.. విదేశీ కోటీశ్వరులను తమవైపు ఆకర్షించడంలో దూసుకుపోతున్న యూఏఈ ఈ విషయంలో అమెరికాను కూడా త్వరలో అధిగమించనుంది. హెన్లీ గ్లోబల్ సిటిజన్(Henley global citizen report) రిపోర్ట్ ప్రకారం.. 2022లో యూఏఈకి వివిధ దేశాల నుంచి 4 వేల మంది మిలియనీర్లు వలసవెళ్లనున్నారు. రష్యా, చైనా, ఇండియా, హాంగ్‌కాంగ్, ఉక్రెయిన్, బ్రెజిల్ దేశాల నుంచే ధనికులు అత్యధికంగా వలసపోనున్నారు. 


ఇక భారత్ ‌నుంచి ఈ ఏడాది 8 వేల మంది అపరకుబేరులు వివిధ దేశాలకు వలస వెళ్లనున్నారనేది హెన్లీ గ్లోబల్ అంచనా. దుబాయ్, సింగపూర్‌లవైపే అత్యధిక శాతం మంది మొగ్గుచూపుతున్నారట. డ్యూయెల్ సిటిజన్‌షిప్‌ను(ఒకేసారి రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగిఉండటం) భారత్ అనుమతించదు కనుక భారతీయ కుబేరులు..దీర్ఘకాలిక వీసాలపై వ్యాపారాభివృద్ధికి అనువైన దేశాలకు వలస వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక దుబాయ్‌లోని వ్యాపారానుకూల వాతావరణం, ఇన్‌కమ్ ట్యాక్స్‌ చెల్లింపుల నుంచి పూర్తి మినహాయింపు కారణంగా భారత టెక్ ఆంత్రప్రెన్యూర్‌లు గోల్డెన్ వీసాతో దుబాయ్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని ఈ నివేదిక తేల్చింది.  ఈ నివేదిక ప్రకారం.. దుబాయ్‌లోని మొత్తం స్టార్టప్‌ కంపెనీల్లో 30 శాతం భారతీయుల నేతృత్వంలోనివే. మరోవైపు.. భారతీయ టాలెంట్‌కు ఆకర్షించేందుకు దుబాయ్ లక్ష గోల్డెన్ వీసాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది. గోల్డెన్ వీసాతో భారతీయులు ఏకంగా 10 ఏళ్ల పాటు యూఏఈలో నివసించవచ్చు. అంతేకాకుండా.. అక్కడ పూర్తిస్థాయిలో వ్యాపారాలు నిర్వహించేందుకు, చదువుకునేందుకు కూడా ఈ వీసా అవకాశం ఇస్తుంది. 


గోల్డెన్ వీసా ఎవరికి ఇస్తారంటే.. 

యూఏఈలో విదేశీయులు గరిష్టంగా 10 ఏళ్లపాటు నివసించేందుకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేస్తుంది! ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన వృత్తినిపుణలు, కళాకారులు ఈ వీసాకు అర్హులు. ఈ వీసా ఉన్న విదేశీయులకు యూఏఈలో నివారార్హతే కాకుండా.. చదువుకునేందుకు వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. 



Updated Date - 2022-06-18T01:42:18+05:30 IST