తీవ్రమైన సమస్యలను వదిలేశారెందుకు?: బడ్జెట్‌పై మాయావతి

ABN , First Publish Date - 2022-02-01T21:56:39+05:30 IST

ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కొత్త వాగ్దానాలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టారు. గతంలో చేసిన వాగ్దానాలు, ప్రకటనలు అమలు చేయడం మోదీ ప్రభుత్వం మర్చిపోయింది. ఇది ఎంత వరకు సముచితం? నానాటికీ పెరుగుతోన్న పేదరికం..

తీవ్రమైన సమస్యలను వదిలేశారెందుకు?: బడ్జెట్‌పై మాయావతి

న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరుగుతోన్న పేదరికం, నిరుద్యగం, రైతు ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన సమస్యలను కేంద్రం ఎందుకు వదిలేసిందని కేంద్ర బడ్జెట్‌పై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి విమర్శించారు. మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా, ఈ బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని, పెద్ద ఎత్తున ప్రకటనలు చేయడం తప్పితే అమలు గురించి ఆలోచించడమే లేదని మాయావతి అన్నారు.


‘‘ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కొత్త వాగ్దానాలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టారు. గతంలో చేసిన వాగ్దానాలు, ప్రకటనలు అమలు చేయడం మోదీ ప్రభుత్వం మర్చిపోయింది. ఇది ఎంత వరకు సముచితం? నానాటికీ పెరుగుతోన్న పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన సమస్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు ఎందుకు? దేశ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోయింది? కేంద్రం తన వెన్ను తానే తట్టుకోవడం వల్ల దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడం లేదు. పన్నుల మీద పన్నులు వేసి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా నిరుద్యోగం లాంటి కారణాలతో ప్రజల్లో ఉన్న నిరాశ, నిస్పృహ, ఆందోళనలను తగ్గించేందుకు కేంద్ర కృషి చేస్తే బాగుంటుంది’’ అని మాయావతి అన్నారు.

Updated Date - 2022-02-01T21:56:39+05:30 IST