టాయిలెట్ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? మరో రంగులో ఎందుకు ఉండదో తెలుసా?

ABN , First Publish Date - 2022-03-08T16:55:34+05:30 IST

టాయిలెట్ పేపర్ అనేది బాత్రూమ్‌లో కనిపిస్తుంది.

టాయిలెట్ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? మరో రంగులో ఎందుకు ఉండదో తెలుసా?

టాయిలెట్ పేపర్ అనేది బాత్రూమ్‌లో కనిపిస్తుంది. అయితే దీని రంగు తెల్లగా మాత్రమే ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కలర్‌ఫుల్ కాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? దీనిని తెలుసుకోవాలంటే ముందుగా మీరు టాయిలెట్ పేపర్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాల్సి ఉంటుంది. టాయిలెట్ పేపర్‌ను చెట్ల ఫైబర్‌తో లేదా రీసైకిల్ పేపర్‌తో తయారు చేస్తారు. దాని రంగు తెల్లగా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. రీడర్స్ డైజెస్ట్ తెలిపిన వివరాల ప్రకారం టాయిలెట్ పేపర్‌ను తయారు చేసే ఫైబర్ సహజంగా తెల్లగా ఉంటుంది. 


తయారీ ప్రక్రియలో బ్లీచ్ ఉపయోగించినప్పుడు, మురికిగా ఉన్న భాగం పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా ఇది మరింత తెల్లగా మారుతుంది. వాటికి విడిగా రంగు వేయడానికి అంతగా సాధ్యంకాదు. అందుకే అవి తెల్లగా ఉంటాయి. ఇప్పుడు టాయిలెట్ పేపర్ సిద్ధం చేసే రెండవ ప్రక్రియను గురించి చూద్దాం. రీసైకిల్ చేసిన కాగితం అప్పటికే తెల్లగా ఉంటుంది. అందుకే టాయిలెట్ పేపర్ తెల్లగా ఉంటుంది. అయినప్పటికీ దానిని సిద్ధం చేయడానికి బ్లీచ్ కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా వాటి రంగు తేలికగా మారుతుంది. టాయిలెట్ పేపర్ తెల్లగా ఉండడానికి ఇదే కారణం. అయితే 1950లలో టాయిలెట్లలో రంగు కాగితం ఉపయోగించారు. అవి వివిధ రంగులలో ఉండేవి. మరింత సురక్షితంగా ఉండేందుకు రంగుల వాడకాన్ని నిలిపివేశారు. ఫలితంగా టాయిలెట్ పేపర్ తెలుపు రంగులోనే కనిపిస్తుంది. 

Updated Date - 2022-03-08T16:55:34+05:30 IST