ఒలింపిక్స్‌లో అథ్లెట్లు పతకాలను ఎందుకు పంటితో కొరుకుతారు?ఈ ఆచారం ఎలా ప్రారంభమయ్యిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-08T13:43:32+05:30 IST

ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తర్వాత అథ్లెట్ల భావోద్వేగాలకు...

ఒలింపిక్స్‌లో అథ్లెట్లు పతకాలను ఎందుకు పంటితో కొరుకుతారు?ఈ ఆచారం ఎలా ప్రారంభమయ్యిందో తెలిస్తే..

ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తర్వాత అథ్లెట్ల భావోద్వేగాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని ఫొటోలు చూసినప్పుడు పలు సందేహలు వ్యక్తమవుతుంటాయి. వాటిలో విజేతలైన అథెట్లు పతకాన్ని పంటితో కొరికేయడానికి సంబంధించిన ఫొటో ఒకటి. అథ్లెట్లు ఇలా ఎందుకు చేస్తారో మీకేమైనా తెలునా? అయితే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఒలింపిక్స్ క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మొదట్లో  క్రీడాకారులు తాము గౌరవం పొందడానికి దీనిని ఆడేవారు. తొలినాళ్లో ఈ క్రీడల్లో రజత పతకం లేదా కాంస్య పతకం ఉండేదికాదు. ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896లో ఏథెన్స్‌లో ప్రారంభమయ్యాయి. అప్పుడు రజత, కాంస్య పతకాలు మాత్రమే ఉండేవి. గోల్డ్ మెడల్ ఇచ్చే విధానం 1904 నుంచి ప్రారంభమయ్యింది. ఈ బంగారు పతకం బరువు ఎంత ఉంటుంది? ఎలా డిజైన్ చేయాలనే అంశాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయిస్తుంది. అయితే ఒలింపిక్స్‌లో అథ్లెట్లు తమ పంటితో పతకాలను ఎందుకు కొరుకుతారు? అది ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? అనే ప్రశ్నల వెనుక ఆస్తకర కథనం ఉంది.  పతకాన్ని పరీక్షించేందుకే దానిని పంటితో కొరుకుతారు. ఈ విధంగా అది నిజమైనదో కాదో తెలుసుకుంటారు. పతకాన్ని ప్రత్యేకమైన బంగారంతో తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో కొన్ని లోహాలను కలుపుతారు. అథ్లెట్లు ఇలా కొరికినప్పుడు ఆ పతకం నిజమైన బంగారంతో చేసినదోకాదో తెలుస్తుంది. పతకాన్ని ఇలా కొరికినప్పుడు దానిపై గీత పడితే దానిలో సీసం వంటి లోహాలు కలిపినట్లు స్పష్టమవుతుంది. స్వచ్ఛమైన బంగారాన్ని కొరికినప్పుడు దానిపై గాట్లు పడవని చెబుతారు. పతకాలను పంటితో కొరకడం వెనుక మరో కథనం కూడా ఉంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత అథ్లెట్‌ను పోజులివ్వమని ఫోటోగ్రాఫర్లు కోరుతారు. ఈ సమయంలో అథ్లెట్లు పతకాలు పట్టుకుని నవ్వుతూ ఫొటోలు దిగేవారు. అయితే ఫోటోగ్రాఫర్‌లు పదే పదే అథ్లెట్లను పోజ్ మార్చమని అడుగుతుంటారు. దీంతో అథ్లెట్లు పతకాన్ని పంటితో పట్టుకుని ఫోజులివ్వడం ప్రారంభించారని కూడా చెబుతుంటారు.

Updated Date - 2022-01-08T13:43:32+05:30 IST