
వాంఖడే వేదికగా సోమవారం రాత్రి Chennai Super Kings, Punjab Kings జట్ల మధ్య IPL మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో CSK ఓడి PBKS గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌ను నేరుగా స్టేడియానికి వెళ్లి చూసినవారిని గానీ, లైవ్ చూసిన వారిని గానీ ఓ విషయం ఆశ్చర్యానికి గురిచేసింది. పంజాబ్ ఆల్‌రౌండర్ Rishi Dhawan ధరించిన సేఫ్టీ షీల్డే అందుకు కారణం. Rishi Dhawan బౌలింగ్ చేసే సమయంలో ఈ సేఫ్టీ షీల్డ్ ధరించాడు. ఎందుకు అతను ఒక్కడే ఈ షీల్డ్ ధరించాడనే ప్రశ్న మ్యాచ్ చూస్తున్న వారిలో చాలామందిని తొలిచేసింది.
ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్న వారు ఇంటర్నెట్‌లోకి వెళ్లి రిషి ధావన్ సేఫ్టీ షీల్డ్ కథేంటో తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. Rishi Dhawan Safety Shield ధరించడానికి కారణం లేకపోలేదు. Ranji Trophy ఆడుతున్న సమయంలో Rishi Dhawan ముక్కుకు గాయమైంది. ఈ మధ్యనే ముక్కుకు సర్జరీ (Nose Surgery) కూడా జరిగింది. కోలుకున్న అనంతరం CSKతో జరిగిన ipl మ్యాచ్‌తో రిషి ధావన్ Comeback ఇచ్చాడు. వైద్యుల సలహా మేరకు ఆ సేఫ్టీ షీల్డ్ ధరించినట్లు తెలిసింది. ఇదీ.. రిషి ధావన్ సేఫ్టీ షీల్డ్ వెనకున్న అసలు విషయం.
ఈ విషయం తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో కొందరు రిషి ధావన్ సేఫ్టీ షీల్డ్ ధరించడంపై మీమ్స్ వేసి ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. Krish సినిమాలో హృతిక్ ధరించిన మాస్క్‌లా ఉందని కొందరు, ఎవెంజర్స్‌తో పోల్చుతూ ఇంకొందరు మీమ్స్ వేసి రిషి ధావన్‌పై ఛలోక్తులు విసురుతున్నారు. హాస్యాన్ని పండించే ప్రయత్నం చేస్తున్నారు. బౌలింగ్ చేసే సమయంలో పొరపాటున బ్యాట్స్‌మెన్ కొట్టే బంతి ముక్కుకు తగిలితే ఇబ్బందవుతుందన్న ఉద్దేశంతోనే రిషి ధావన్ ఈ సేఫ్టీ షీల్డ్ ధరించాడు. దాదాపు 4 ఏళ్ల తర్వాత IPL Comeback ఇచ్చిన రిషి ధావన్ CSKతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌లో కీలక ఆటగాడైన Shivam Dube వికెట్ తీసి PBKS గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రిషి ధావన్‌ను IPL మెగా వేలంలో PBKS జట్టు 55 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.