Texas కు భారీగా వలసలు.. California నుంచే ఎందుకు ఎక్కువగా వస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-05-11T02:36:56+05:30 IST

మానవ సమాజాల్లో వలసలు సహజమే. ప్రకృతి విపత్తులు కారణంగానో లేకా మరింత మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూనో ప్రజలు వలస పోతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజలు కూడా పొరుగు రాష్ట్రమైన టెక్సాస్‌కు పెద్ద సంఖ్యలో తరలివెళుతున్నారు.

Texas కు భారీగా వలసలు.. California నుంచే ఎందుకు ఎక్కువగా వస్తున్నారంటే..

ఎన్నారై డెస్క్: మానవ సమాజాల్లో వలసలు సహజమే. ప్రకృతి విపత్తులు కారణంగానో లేక మరింత మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూనో ప్రజలు వలస పోతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజలు కూడా పొరుగు రాష్ట్రమైన టెక్సాస్‌కు పెద్ద సంఖ్యలో తరలివెళుతున్నారు. అయితే.. వారి వలసలకు కారణం.. రియల్ ఎస్టేట్ ధరలు. తాజా లెక్కల ప్రకారం.. టెక్సాస్‌లో కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిలో 20 శాతం మంది కాలిఫోర్నియా నుంచి వచ్చిన వారే. ఇక 2010 నుంచి 2019 మధ్యలో 885,000 మంది అమెరికన్లు టెక్సాస్‌కు మకాం మార్చుకోగా.. వారిలో 303,000 మంది కాలిఫోర్నియా నుంచి వచ్చినవారే..! అంటే.. మొత్తం వలసల్లో కాలిఫోర్నియా ప్రజల వాటా దాదాపు 34 శాతం.  అరిజోనా, నెవాడా, వాషింగ్టన్, ఓరేగావ్ వంటి రాష్ట్రాలకు కూడా  కాలిఫోర్నియా వారు వెళుతున్నా అత్యధిక శాతం మంది మాత్రం టెక్సాస్‌నే ఎంచుకుంటున్నారు. 


‘రియల్’ భారం..

కాలిఫోర్నియాలో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు ఇలా రాష్ట్రాన్ని వీడుతున్నారని అక్కడి పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టెక్సాస్‌లో ఇళ్ల సగటు ధర 362,000 డాలర్లుగా ఉంటే.. కాలిఫోర్నియాలో మాత్రం ఏకంగా 800,000 డాలర్లుగా ఉంది. ఇక శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇది ఏకంగా 1.3 మిలియన్ డాలర్లకు కూడా చేరుకుంది. గత 30 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ప్రజల అవసరాలకు తగిన స్థాయిలో ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 



Read more