సమస్యలు తీరనప్పుడు సభ ఎందుకు?

ABN , First Publish Date - 2022-05-20T05:16:10+05:30 IST

సమస్యలకు పరిష్కారం చూపనప్పుడు సభ ఎందుకు నిర్వహిస్తారని మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు తీరనప్పుడు సభ ఎందుకు?
అధికారులను నిలదీస్తున్న సర్పంచులు

  మండల సభలో సభ్యుల ఆగ్రహం


ములుగు, మే 19: సమస్యలకు పరిష్కారం చూపనప్పుడు సభ ఎందుకు నిర్వహిస్తారని మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ములుగులో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ లావణ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ సమస్యలను వివరించారు. సర్పంచ్‌లు గంగిశెట్టి గణేష్‌, వెంకట్‌రెడ్డి, వెంకటేశం మాట్లాడుతూ.. రెండేళ్లుగా విద్యుత్‌, మిషన్‌ భగీరథ సమస్యలను ప్రతీ సమావేశంలో వివరించినా పరిష్కరించడం లేదన్నారు. నిధుల కొరత కారణంగా పనులు సకాలంలో చేయలేకపోతున్నట్లు విద్యుత్‌ అధికారులు వెల్లడించారు. ఎంపీపీ లావణ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జహంగీర్‌ మాట్లాడుతూ..  గ్రామాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రజాప్రతినిధుల ఇబ్బందులను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి అదనంగా నిధులు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. కాగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. సమావేశంలో మండల రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీలు లింగారెడ్డి, ప్రవీణ్‌, నవ్యశ్రీ, మమత, మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు రామచంద్రం, సత్యనారాయణ పాల్గొన్నారు.


 

Updated Date - 2022-05-20T05:16:10+05:30 IST