సీలింగ్ ఫ్యాన్‌లో సాధారణంగా 3 బ్లేడ్‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-07T17:41:54+05:30 IST

సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్‌లను మనం..

సీలింగ్ ఫ్యాన్‌లో సాధారణంగా 3 బ్లేడ్‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్‌లను మనం ఎప్పటినుంచో ఉపయోగిస్తూనే ఉన్నాం. అయితే సీలింగ్ ఫ్యాన్‌లకు 3 బ్లేడ్‌లు, టేబుల్ ఫ్యాన్‌లకు 4 బ్లేడ్‌లు ఎందుకు ఉంటాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాన్‌లో బ్లేడ్‌లు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ గాలిని వీస్తుందని సైన్స్ చెబుతుంది. మన దేశం వేడి వాతావరణం ఉన్న దేశం కావడం వల్ల.. బలమైన గాలులు వీచే మన ప్రాంతంలో ఫ్యాన్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దేశంలో ఎప్పటినుంచో మూడు రెక్కల ఫ్యాన్ ట్రెండ్ ఉంది. అయితే విదేశాల్లో 4 బ్లేడ్లు కలిగిన ఫ్యాన్లు ఉంటాయి.  ఎందుకంటే ఆయా దేశాలలో చల్లటి వాతావరణం ఉంటుంది. ఆయా దేశాలలో 4 బ్లేడ్లు కలిగిన ఫ్లాన్లు వినియోగించడం వలన మీడియం వేగంతో గాలి వీస్తుంది. చల్లని వాతావరణం కలిగిన దేశాల్లో బలమైన గాలివీచే ఫ్యాన్లు ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఆయా దేశాలలో 4 బ్లేడ్లు కలిగిన ఫ్యాన్లు ఉంటాయి. 



Updated Date - 2022-02-07T17:41:54+05:30 IST