అంత తొందర ఎందుకు?: Karnataka Govt పై DK ఫైర్

ABN , First Publish Date - 2022-05-12T19:12:32+05:30 IST

యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేని ఆరాటం ఏదైనా అభివృద్ధి పని చేపట్టడంలో లేని తొందరపాటు మతాంతర వివాహ నిరోధక బిల్లు (anti-conversion bill) విషయంలో ఎందుకు ఉందని కర్ణాటక ప్రభుత్వాన్ని KPCC అధినేత DK Shivakumar..

అంత తొందర ఎందుకు?: Karnataka Govt పై DK ఫైర్

బెంగళూరు: యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేని ఆరాటం ఏదైనా అభివృద్ధి పని చేపట్టడంలో లేని తొందరపాటు మతమార్పిడి నిరోధక బిల్లు (anti-conversion bill) విషయంలో ఎందుకు ఉందని కర్ణాటక ప్రభుత్వాన్ని KPCC అధినేత DK Shivakumar ప్రశ్నించారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీ ముందుకు anti-conversion bill ను ప్రభుత్వం తీసుకురానుంది. కాగా, దీనికి ముందు డీకే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం చాలా పనులు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, ప్రజలకు అవసరమైన అనేక పనులు చేయాల్సి ఉంది. చాలా అభివృద్ధి పనులు చేయాలి. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలాంటివి వదిలేసి మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించడానికి ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదు’’ అని డీకే అన్నారు.

Read more