BAN : అమేజాన్‌లో చైనాకు భారీ షాక్

ABN , First Publish Date - 2021-09-18T23:18:25+05:30 IST

అమేజాన్ సంస్థ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 600 బ్రాండ్స్‌ను పర్మినెంట్‌గా బ్యాన్ చేసింది. ఇకపై ఆయా ఉత్పత్తులు అమేజాన్ సైట్‌లో అందుబాటులో ఉండవు. మొత్తం 600 బ్రాండ్స్‌లో, కొన్ని చైనాలోని పాప్యులర్ కంపెనీలు కూడా ఉండటం, చాలా మందిని షాక్‌కు గురిచేసింది.

BAN : అమేజాన్‌లో చైనాకు భారీ షాక్

అమేజాన్ సంస్థ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన 600 బ్రాండ్స్‌ను పర్మినెంట్‌గా బ్యాన్ చేసింది. ఇకపై ఆయా ఉత్పత్తులు అమేజాన్ సైట్‌లో అందుబాటులో ఉండవు. మొత్తం 600 బ్రాండ్స్‌లో, కొన్ని చైనాలోని పాప్యులర్ కంపెనీలు కూడా ఉండటం, చాలా మందిని షాక్‌కు గురిచేసింది. 

చైనా బ్రాండ్స్‌పై అమేజాన్ అనూహ్య ఆగ్రహానికి కారణం వాటిని అమ్ముతోన్న కంపెనీల వ్యవహారశైలేనట. సదరు చైనీస్ సంస్థలు ప్రత్యేక గిఫ్ట్ కార్డ్స్ ఎరగా చూపుతూ వినియోగదారుల చేత పాజిటివ్ రివ్యూస్ రాయించుకుంటున్నాయి. ఈ విషయం అమేజాన్ దృష్టికి రావటం, అలా చేయటం వారి నిబంధనలకు వ్యతిరేకం కావటంతో అమాంతం వేటు పడింది. అయితే, ఇది చైనాకు వ్యతిరేకంగా తాము తీసుకున్న చర్య కాదని అమేజాన్ చెబుతోంది. ముందు ముందు ఏ దేశం బ్రాండ్స్‌కైనా రూల్స్ పాటించకపోతే సెగ తప్పదని హెచ్చరిస్తోంది. 

అమేజాన్‌లో నిషేధం కారణంగా చైనీస్ కంపెనీలు ఇప్పుడు ఈబే, అలీఎక్స్‌ప్రెస్ లాంటి ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి...   

Updated Date - 2021-09-18T23:18:25+05:30 IST