imd weather bulletin: పశ్చిమ తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2022-07-23T14:17:45+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం....

imd weather bulletin: పశ్చిమ తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్‌లో(imd weather bulletin) తెలిపింది. రుతుపవనాల ద్రోణి, అల్పపీడనం దక్షిణ దిశగా మారే అవకాశం ఉన్నందున శనివారం నుంచి పశ్చిమ తీరం, మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు( very heavy rainfall)కురుస్తాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department (IMD)  సీనియర్ అధికారి తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో శనివారం నుంచి ఈ నెల 26వతేదీ వరకు అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఒడిశాలోని కలహండి, కంథమాల్, బౌధ, సోనేపు జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్(orange alert) ప్రకటించారు.జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. 


చేపలవేటకు వెళ్లవద్దు: ఐఎండీ హెచ్చరిక

అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మత్స్యాకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని ఐఎండీ అధికారులు సూచించారు. జులై నెలలో  రుతుపవనాల ద్రోణి వల్ల భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు,వరదలకు దారితీసిందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 40శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూన్‌ నెలలో 8శాతం వర్షపాతం లోటు తర్వాత, జులైలో ఇప్పటివరకు 10శాతం అదనపు వర్షం నమోదైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 111శాతం అధిక వర్షపాతం నమోదైంది. మరాఠ్వాడాలో 73శాతం, సౌరాష్ట్ర, కచ్‌లో 79శాతం,విదర్భలో 48శాతం అధికంగా వర్షం కురిసింది. దేశవ్యాప్తంగా 10శాతం అదనపు వర్షాలు కురిశాయి.


‘‘సముద్ర లక్షణాలు, గాలి పరిస్థితి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణం యొక్క మేఘాలను ప్రేరేపించే సామర్థ్యం తూర్పు-పశ్చిమ రుతుపవనాల ద్రోణి యొక్క స్థితిని ప్రభావితం చేస్తాయి’’ అని ఐఎండీ(IMD)లోని జాతీయ వాతావరణ అంచనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి చెప్పారు.హిమాలయాల వెంబడి కురుస్తున్న భారీ వర్షాలు బ్రహ్మపుత్ర నదిలో వరదలకు దారితీస్తుంది. ‘‘జులై 26 తర్వాత ఉపరితలద్రోణి మళ్లీ ఉత్తరం వైపునకు మారుతుంది. ఇది రుతుపవనాల నిర్ణయిస్తుంది’’ అని IMD డైరెక్టర్ జనరల్ మోహపాత్ర చెప్పారు.


అధిక వర్షాల కారణంగా మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గత వారం తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరదలు వచ్చి పంటలు దెబ్బతిన్నాయి.భారీవర్షాల ప్రభావం వల్ల కూరగాయల పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు నష్టపోయారని వ్యవసాయ అధికారులు చెప్పారు.


Updated Date - 2022-07-23T14:17:45+05:30 IST