అటెండర్‌ హత్య కేసులో భార్యే నిందితురాలు

ABN , First Publish Date - 2021-07-30T07:21:25+05:30 IST

చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వాసు (46) హత్య కేసులో ఆయన భార్య స్వప్నప్రియను నిందితురాలిగా తేల్చారు.

అటెండర్‌ హత్య కేసులో భార్యే నిందితురాలు
స్వప్న ప్రియ

చంద్రగిరి, జూలై 29: చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వాసు (46) హత్య కేసులో ఆయన భార్య స్వప్నప్రియను నిందితురాలిగా తేల్చారు. ఈ మేరకు గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ అరిగెలవారిపల్లెకు చెందిన వాసు, కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తూ చిత్తూరులోనే నివాసం ఉండేవారు. అతడి కుమారుడిని బంధువుల ఇంటికి పంపారు. ఆ సమయంలో వాసుకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పట్లో స్వప్నప్రియ తెలిపింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చంద్రగిరి పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెడ భాగంలో ఉరి వేసిన గుర్తులు ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నివేదిక తెప్పించారు. ఈ నెల 19న కేసు నమోదుకాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టిన ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసును చిత్తూరు పోలీసులకు బదలాయించారు. 

Updated Date - 2021-07-30T07:21:25+05:30 IST