పదేళ్ల కొడుకుతో సహా భార్య అదృశ్యం.. మేడ మీద గదిలో అద్దెకు ఉండే కుర్రాడిని అడిగేందుకు ఆ భర్త వెళ్తే..

Jul 26 2021 @ 17:15PM

ఇంటర్నెట్ డెస్క్: బయటకు వెళ్లి తిరిగొచ్చాడా భర్త. ఇంట్లో ఉండాల్సిన భార్య కనిపించలేదు. ఆడుకుంటూ ఉండాల్సిన పదేళ్ల కొడుకు కూడా కనిపించలేదు. ఇదేంటి వీళ్లిద్దరూ ఎక్కడికెళ్లారు? అని ఆశ్చర్యపోయిన అతను మేడమీద అద్దెకు ఉండే యువకుడిని అడిగేందుకు వెళ్లాడు. అతను కూడా లేడు! దీంతో షాకైన అతనికి విషయం పూర్తిగా అర్థమైపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, తన భార్య మేడపై అద్దెకుండే యువకుడితో పరారైందని ఫిర్యాదుచేశాడు. ఈ ఘటన హరియాణాలోని పానిపట్‌లో జరిగింది.


కుల్దీప్ అనే యువకుడు రెండు నెలల క్రితం వినోద్ అనే వ్యక్తిని సంప్రదించాడు. వినోద్ ఇంటి మేడపై ఖాళీగా ఉన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఉండగా వినోద్ భార్య.. కుల్దీప్‌తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ వినోద్‌కు తెలియకుండా తమ సంబంధాన్ని కొనసాగించారు. అయితే కొన్నిరోజుల క్రితం కుల్దీప్‌ తన భార్యతో ప్రేమాయణం సాగిస్తున్నాడని వినోద్‌కు తెలిసింది. మొదట ఈ విషయాన్ని అతను నమ్మలేకపోయాడు. కానీ భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పులు చూస్తే అనుమానం వచ్చింది. వాళ్లిద్దరి మధ్య సంబంధం రూఢీ అవడంతో వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుల్దీప్‌ను ఇళ్లు ఖాళీ చేయాలని తేల్చిచెప్పాడు. అతను ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లలేనని, మరుసటి రోజు ఖాళీ చేస్తానని వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజే వినోద్‌కు భారీ షాక్ తగిలింది. అతని భార్య కూడా ఇళ్లు ఖాళీ చేసిన కుల్దీప్‌తో పారిపోయింది. వెళ్తూ వెళ్తూ పదేళ్ల కొడుకును కూడా వెంటబెట్టుకుపోయింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తన భార్యను ఎత్తుకెళ్లాడని కుల్దీప్‌పై వినోద్ ఫిర్యాదు చేశాడు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...