10 ఏళ్ల క్రితం పెళ్లి.. తల్లి కావాలనుకున్న భార్య.. సాధ్యం కాదన్న భర్త.. చివరికి ఏం జరిగిందంటే

ABN , First Publish Date - 2021-10-05T23:05:35+05:30 IST

నాలుగేళ్లపాటు సహజీవనం చేసి, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అనంతరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సుమారుగా 10ఏళ్లపాటు వారి సంసారం సాఫీగా సాగింది. ఈ క్రమంలోనే ఆమె మనసు తల్లికావాలని తల్లడిల్లింది

10 ఏళ్ల క్రితం పెళ్లి.. తల్లి కావాలనుకున్న భార్య.. సాధ్యం కాదన్న భర్త.. చివరికి ఏం జరిగిందంటే

ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్లపాటు సహజీవనం చేసి, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అనంతరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సుమారుగా 10ఏళ్లపాటు వారి సంసారం సాఫీగా సాగింది. ఈ క్రమంలోనే ఆమె మనసు తల్లికావాలని తల్లడిల్లింది. పిల్లలతో ‘అమ్మా’ అని పిలుపించుకోవాలని ఆరాటపడింది. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే దానికి భర్త నిరాకరించడంతో.. వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఆ గొడవలే చివరికి ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయి.


ఇంతకూ ఏం జరిగిందంటే.. 1994లో భర్తను కోల్పోయిన గులాబో దేవీ అనే మహిళ.. ఢిల్లీలోని ఓ ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు బాబులాల్ మీనా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సహజీవనం వరకూ లెళ్లింది. సుమారు నాలుగేళ్లపాటు సహజీవనంలో ఉన్న ఆ ఇద్దరూ.. 2011లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాలుగా వారి సంసారం సాఫీగానే సాగింది. సుమారు రూ.17లక్షలతో ఓ సొంతంగా ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. అయితే కొద్ది నెలల క్రితం గులాబో దేవీకి తాను తల్లవ్వాలనే కొరిక కలిగింది. పిల్లలతో ‘అమ్మా’ అని పించుకోవాలనుకుంది. అందుకోసం బంధువులకు పుట్టిన ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలని భావించింది.


అదే విషయాన్ని బాబులాల్ దగ్గర వ్యక్త పరిచింది. దానికి బాబులాల్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో గులాబో దేవీ.. బాబులాల్ నుంచి దూరమై వేరే ప్రాంతంలో నివసించడం మొదలు పెట్టింది. అంతేకాకుండా.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాడనికి సిద్ధం అయింది. ఈ విషయం తెలిసి.. బాబులాల్ తట్టుకోలేకపోయాడు. దీంతో రూ.2.50లక్షల సుపారీ ఇచ్చి.. గులాబో దేవీని హత్య చేయించాడు. గులాబో దేవీ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాబులాలే ఈ హత్య చేయించినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఫ్లాట్ గులాబో దేవీ పేరుపైనే ఉందని.. ఆమె వేరకొరిని పెళ్లి చేసుకుంటే.. ప్రాపర్టీ పోతుందనే ఉద్దేశంతోనే హత్య చేయించినట్లు విచారణ సందర్భంగా బుబూలాల్ పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు.

Updated Date - 2021-10-05T23:05:35+05:30 IST