ఇష్టంలేని భాషలో మాట్లాడుతోందని.. గర్భవతి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త..

ABN , First Publish Date - 2022-05-13T05:54:44+05:30 IST

సాధారణంగా మహిళలు గర్భవతి అయితే ఆ కుటుంబాలు వాళ్లను గాజుబొమ్మల్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఎలాంటి కష్టం రాకుండా కావలసిన పనులన్నీ చేసి పెడతారు. అలాంటిది ఒక కుటుంబం మాత్రం కడుపుతో ఉన్న మహిళపై కిరోసిన్ పోసి...

ఇష్టంలేని భాషలో మాట్లాడుతోందని.. గర్భవతి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త..

సాధారణంగా మహిళలు గర్భవతి అయితే ఆ కుటుంబాలు వాళ్లను గాజుబొమ్మల్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఎలాంటి కష్టం రాకుండా కావలసిన పనులన్నీ చేసి పెడతారు. అలాంటిది ఒక కుటుంబం మాత్రం కడుపుతో ఉన్న మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన హరియాణా రాజధాని చండీగఢ్‌లో వెలుగు చూసింది. 


సుజాత అనే పంజాబీ అమ్మాయిని మర్చంట్ నేవీలో పనిచేసే యువకుడికి ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. వాళ్లకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె ఇటీవల మళ్లీ గర్భవతి అయింది. పెళ్లి అయిన నాటి నుంచి మెట్టినింట తనకు నరకం చూపిస్తూనే వచ్చారని సుజాత చెబుతోంది. పొరపాటున పంజాబీలో మాట్లాడితే అత్తమామలు కూడా తనను కొట్టేవారని వెల్లడించింది. వాళ్లది గుప్తా కుటుంబం కావడంతో ఇంట్లో పంజాబీ మాట్లాడొద్దని నిషేధించారని, మాతృభాష కావడంతో పొరపాటున ఒక్కోసారి మాట్లాడేదాన్నని, అలా చేసిన రోజు నరకం చూపించేవారని ఆమె వాపోయింది. ఇటీవలి కాలంలో తన భర్త మరో అమ్మాయితో సన్నిహితంగా మెలుగుతున్నాడని, దీనిపై భర్తను నిలదీయడంతో గొడవ జరిగిందని చెప్పింది.


దీంతో కోపం తెచ్చుకున్న భర్త ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మూడు నెలలపాటు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడిన ఆమె ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అసలు తమ కంప్లయింట్‌ను పట్టించుకోవడం లేదని సుజాత కుటుంబం ఆరోపించింది.

Read more