కొడుకు అదృశ్యం.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. భర్త ప్రవర్తన చూసి అనుమానంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-11-17T20:54:49+05:30 IST

దీపావళి రోజు నుంచి 15 ఏళ్ల కొడుకు కనిపించలేదు.. తండ్రి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు..

కొడుకు అదృశ్యం.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. భర్త ప్రవర్తన చూసి అనుమానంతో ఆ భార్య ఏం చేసిందంటే..

దీపావళి రోజు నుంచి 15 ఏళ్ల కొడుకు కనిపించలేదు.. తండ్రి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.. పోలీసులు ఆ బాలుడి కోసం అన్వేషణ సాగిస్తున్నారు.. వారం రోజుల తర్వాత ఆ బాలుడి తల్లి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. తన భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి వెల్లడించింది.. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయం రాబట్టారు.. తండ్రే అసలు దోషి అని తేల్చారు.. హర్యానాలో పానిపట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


పానిపట్‌కు సమీపంలోని కల్‌యుగి ప్రాంతానికి చెందిన ఆదిత్య ఈ నెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో అతని తండ్రి హరిప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే అతడి భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్తపై అనుమానం వ్యక్తం చేసింది. కొడుకు కనిపించడం లేదనే బాధ భర్తలో కనిపించడం లేదని, అతను హుషారుగానే ఉన్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో హరిప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో తన కొడుకును తనే చంపేసినట్టు హరిప్రసాద్ అంగీకరించాడు. 


తన కొడుకు ఆదిత్య తనతో తరచుగా గొడవ పెట్టుకునేవాడని, ఎప్పుడూ తన మాట వినేవాడు కాదని, నలుగురిలో తన గురించి అవహేళనగా మాట్లాడేవాడని, అందుకే అతడని చంపాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఆదిత్యను సమీపంలోని చెరుకు తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశానని తెలిపాడు. దీంతో హరిప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు తరలించారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. 

Updated Date - 2021-11-17T20:54:49+05:30 IST