భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. కేసు పరిష్కరించిన పోలీసులకు షాక్.. అసలు ఆ మిస్సింగ్ వ్యక్తి ఏమయ్యాడంటే..

ABN , First Publish Date - 2022-02-14T05:43:36+05:30 IST

తన భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఒక భార్య ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన మరుసటి రోజే పోలీసులకు ఒక శవం దొరికింది. మృతుడు ఆ మిస్సింగ్ కేసులో వెతుకుతున్న వ్యక్తే అని తెలియడానికి పోలీసులకు ఎంతో సమయం...

భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. కేసు పరిష్కరించిన పోలీసులకు షాక్.. అసలు ఆ మిస్సింగ్ వ్యక్తి ఏమయ్యాడంటే..

తన భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఒక భార్య ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన మరుసటి రోజే పోలీసులకు ఒక శవం దొరికింది. మృతుడు ఆ మిస్సింగ్ కేసులో వెతుకుతున్న వ్యక్తే అని తెలియడానికి పోలీసులకు ఎంతో సమయం పట్టలేదు. కానీ మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారడంతో పోలీసులు కాస్త చాకచక్యంగా వ్యవహరించి అసలు విషయం తెలుసుకున్నారు. ఆ హత్య వెనుక ఉన్న కారణం తెలిసి పోలీసులు కూడా షాకయ్యారు.


వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్ర రాజధాని పట్నా సమీపంలో ఉన్న నొహటా గ్రామానికి చెందిన సూరజ్ కుమార్ (42) కొన్నేళ్ల క్రితం కాజల్ కుమారీ అనే మహిళ వివాహం చేసుకున్నాడు. సూరజ్ కుమార్ రైల్వే విభాగంలో ఒక పోల్ రిపేర్ ఉద్యోగం చేసేవాడు. గత రెండు సంవత్సరాలుగా సూరజ్ కుమార్ మేనల్లుడు ఆకాశ్ కుమార్ కూడా మేనమామ ఇంట్లోనే ఉండేవాడు. ఈ క్రమంలో సూరజ్ కుమార్ భార్య కాజల్ కుమారి తన భర్త మేనల్లుడిపై మనసుపడింది. అలా ఆకాశ్ కుమార్ కూడా వావి వరుసలు మరిచి తన అత్త(మేనమామ భార్య)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 


అయితే ఒక రోజు సూరజ్ కుమార్‌కు తన భార్య, మేనల్లుడి మధ్య ఏదో ఉందని అనుమానం వచ్చింది. దీంతో అతను ఆకాశ్ కుమార్‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అలా ఆకాశ్ కుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా.. మేనమామ లేని సమయంలో ఇంటికి వస్తుండేవాడు. ఇక వారి మధ్య ఉన్న బంధానికి అడ్డుపడుతున్న సూరజ్ కుమార్‌ని తొలగించాలని.. కాజల్ కుమారి ఒక ప్లాన్ వేసింది. 


ఒకరోజు ఆకాశ్ కుమార్ అన స్నేహితుడు అజిత్‌తో కలిసి ఊరి చివర ఒక తోటలో మద్యం పార్టీ పెట్టుకున్నాడు. అక్కడికి రావాలని తన మేనమామ సూరజ్ కుమార్‌ని ఆహ్వానించాడు. దీంతో సూరజ్ కుమార్ మేనల్లుడి  ఆహ్వానం మేరకు తోటకి వెళ్లాడు. అక్కడ అతనికి ఆకాశ్ కుమార్, అతని స్నేహితుడు బాగా మద్యం తాగించారు. సూరజ్ కుమార్ స్పృహ కోల్పోయాక ఆకాశ్, అతని స్నేహితుడు కలిసి అపస్మారక స్థితిలో ఉన్న సూరజ్ కుమార్ గొంతుకోసి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని చెట్ల పొదల్లో దాచేశారు. 


మరోవైపు ప్లాన్‌లో భాగంగా సూరజ్ కుమార్ భార్య కాజల్ కుమారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనబడడం లేదంటూ  ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు మరుసటి రోజు సూరజ్ కుమార్ శవం దొరికింది. పోలీసుల బృందం సూరజ్ కుమార్ హత్య కేసులో విచారణ చేసి ఆకాశ్ కుమార్‌పై అనుమానంతో అరెస్టు చేశారు. అప్పుడతను తానే హత్య చేసినట్టుగా అంగీకరించాడు. ఇదంతా కాజల్ కుమారి ప్రేమలో చేశానని.. ఆమె చెప్పిన ప్రకారమే అంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చాడు. 


పోలీసులు కాజల్ కుమారి, ఆకాశ్ కుమార్, అతని స్నేహితుడు అజిత్‌లపై హత్య కేసే నమోదు చేసి అరెస్టు చేశారు.


Updated Date - 2022-02-14T05:43:36+05:30 IST