భర్త రెండో పెళ్లి.. న్యాయం కోసం వివాహిత పోరాటం

ABN , First Publish Date - 2020-12-03T20:09:57+05:30 IST

తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత బిడ్డతో సహా బుధవారం ప్రత్తిపాడులో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ ఆందోళనకు గ్రామ మహిళలు, పెద్దలు సంఘీభావం తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం.. ప్రత్తిపాడులో కొత్తపేటకు చెందిన అరుణ వరలక్ష్మి, చిరసాల వీరబాబు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకోవడంతో

భర్త రెండో పెళ్లి.. న్యాయం కోసం వివాహిత పోరాటం

ప్రత్తిపాడులో బిడ్డతో నిరాహారదీక్ష

ఎస్‌ఐల జోక్యంతో దీక్ష విరమణ


ప్రత్తిపాడు(తూర్పు గోదావరి జిల్లా): తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత బిడ్డతో సహా బుధవారం ప్రత్తిపాడులో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ ఆందోళనకు గ్రామ మహిళలు, పెద్దలు సంఘీభావం తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం.. ప్రత్తిపాడులో కొత్తపేటకు చెందిన అరుణ వరలక్ష్మి, చిరసాల వీరబాబు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకోవడంతో పెద్దల సమక్షంలోనే 2020 ఫిబ్రవరి 13న వివాహం చేశారు. కట్నకానుకలుగా రూ.10 లక్షల నగదు, రూ.లక్ష ఆడపడుచు కట్నం, 10 కాసుల బంగారాన్ని వరలక్ష్మి కుటుంబీకులు అత్తింటివారికి అందజేశారు. దంపతులకు మగబిడ్డ కూడా జన్మించాడు. కానీ తరచూ వరలక్ష్మిని వీరబాబు, అతడి కుటుంబీకులు దుర్భాషలాడుతూ అదనపు కట్నం కోసం వేధించేవారు. 


ఇంట్లో ఉండవద్దని, వేరే కాపురం పెట్టాలని ఒత్తిడి చేసేశారు. బాబు పుట్టిన తరువాత కూడా భర్త అత్తమామలు, ఆడపడచు, ఇతర కుటుంబీకులు తనను ఇంట్లోకి రానీయకుండా వేధించేవారని వరలక్ష్మి వాపోయింది. ఈ విషయాన్ని స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లగా మరింత వేధింపులు, శారీరక, మానసికంగా ఇబ్బందులు పెట్టేవారని ఆమె వాపోయింది. వీరబాబు గతనెల 25న మేడపాడుకు చెందిన యువతిని చట్టవిరుద్ధంగా వివాహామాడాడని, తనకు న్యాయం చేయాలని వరలక్ష్మి విజ్ఞప్తి చేసింది. పంచాయతీ కార్యాలయం వద్ద ఆమె చేపట్టిన నిరాహార దీక్షకు మహిళలతోపాటు వైసీపీ మండల కన్వీనర్‌ బెహరా దొరబాబు, గుడాల వెంకటరత్నం, ఆకుల వీరబాబు అండగా నిలిచారు. ఎస్‌ఐలు బి.శంకరరావు, ఆచంట సత్యనారాయణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 

Updated Date - 2020-12-03T20:09:57+05:30 IST