భార్యభర్తల మధ్య గొడవ.. భర్త ప్రియురాలు కూడా ఇంట్లోనే మకాం.. చివరికి సమస్య ఎలా ముగిసిందంటే..
ABN , First Publish Date - 2021-12-28T10:28:17+05:30 IST
అతనో సినీ నటుడు. ఇంట్లో చక్కని భార్య ఉండగా.. ఒక సినీ నటితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఇతని ప్రేమకు స్పందించింది. ప్రియురాలిని తరుచూ ఇంటికి తీసుకువచ్చేవాడు. ఒకరోజు భార్యకు వారిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసి..
అతనో సినీ నటుడు. ఇంట్లో చక్కని భార్య ఉండగా.. ఒక సినీ నటితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఇతని ప్రేమకు స్పందించింది. ప్రియురాలిని తరుచూ ఇంటికి తీసుకువచ్చేవాడు. ఒకరోజు భార్యకు వారిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసి.. భర్తతో గొడవ పెట్టుకుంది. అతను ప్రియురాలిని కూడా ఇంటికే తీసుకొచ్చేశాడు. ముగ్గురూ ఒకే ఇంట్లో ఉంటూ.. రోజూ గొడవపడేవారు. ఒక రోజు సమస్యను ఎలగైనా పరిష్కరించుకోవాలని దారుణానికి పాల్పడ్డారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్పూర్ నగరంలో నివసించే ఇంద్రమోహన్.. భోజ్పూరి సినిమాలలో పేరొందిన నటుడు. అతడికి యోగమాయ అనే భార్య ఉంది. భార్య ఉండగా.. అతను సినీనటి నేహా వర్మతో ప్రేమలో పడ్డాడు. నేహా కూడా ఇంద్రమోహన్తో జీవితం పంచుకోవాలనుకుంది.
నేహాను ఇంద్రమోహన్ ఇంటికి తీసుకొచ్చి తన స్నేహితురాలని భార్యకు పరిచయం చేశాడు. ఆ తరువాత నేహా తరుచూ ఇంద్రమోహన్ ఇంటికి వస్తూ ఉండేది. ఒకరోజు యోగమాయకు తన భర్త ప్రేమ వ్యవహారం గురించి తెలిసిపోయింది. ఇంద్రమోహన్ను ఈ విషయంలో ఆమె నిలదీసింది. కానీ భార్యని పట్టించుకోకుండా ఇంద్రమోహన్ తన ప్రియురాలు నేహాను ఏకంగా ఇంటికే తీసుకొచ్చేశాడు. ముగ్గురూ ఒకే ఇంట్లో ఉండేవారు. దీంతో ఇంట్లో రోజూ గొడవలు జరిగేవి.
ఒక రోజు ఇంద్రమోహన్, నేహా కలిసి యోగమాయ పీడ వదిలికోవాలని ఒక ప్లాన్ వేశారు. అర్ధరాత్రి యోగమాయ నిద్రపోతున్న సమయంలో నేహా ఆమెపై కూర్చొని కత్తితో పలుమార్లు పొడిచింది. దీంతో యోగమాయ గట్టిగా అరిచింది. ఆమె అరుపులకు పక్కింట్లో ఉన్న అత్తమామలు లేచి వచ్చారు. వారు వచ్చేసరికి యోగమాయ రక్తపు మడుగులో విలవిల్లాడుతూ చనిపోయింది. నేహా చేతిలో కత్తి చూసి.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రస్తుతం యోగమాయ హత్యకేసులో పోలీసులు నేహా, ఇంద్రమోహన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.