మీ నాన్న పడుకున్నాడని పిల్లలకు చెప్పి.. భర్త శవంతోనే రాత్రంతా జాగారం.. ఆమె వద్ద 2 ఫోన్లు.. 10 సిమ్‌కార్డులు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-10-26T19:22:38+05:30 IST

ఉలుకూ పలుకూ లేకుండా తండ్రి మంచం మీద పడుకుని ఉండటం చూసి ఆ పిల్లలు ఆశ్చర్యపోయారు. ‘అమ్మా.. నాన్నకు ఏమైంది’ అంటూ తన తల్లిని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన ఆ తల్లి.. ‘మీ నాన్న నిద్ర

మీ నాన్న పడుకున్నాడని పిల్లలకు చెప్పి.. భర్త శవంతోనే రాత్రంతా జాగారం.. ఆమె వద్ద 2 ఫోన్లు.. 10 సిమ్‌కార్డులు.. అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఉలుకూ పలుకూ లేకుండా తండ్రి మంచం మీద పడుకుని ఉండటం చూసి ఆ పిల్లలు ఆశ్చర్యపోయారు. ‘అమ్మా.. నాన్నకు ఏమైంది’ అంటూ తన తల్లిని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన ఆ తల్లి.. ‘మీ నాన్న నిద్రపోతున్నాడు.. డిస్ట్రబ్ చేయవద్దు’ అని చెప్పి పిల్లల సందేహం తీర్చింది. అనంతరం భర్త శవం పక్కనే పడుకుని, రాత్రంతా జాగారం చేసింది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన బాసంతి(29)కి 11ఏళ్ల క్రితం పరిక్షిత్ రావత్(30) అనే వ్యక్తితో పెళ్లైంది. ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కూతరుకు 7ఏళ్ల వయసు, కుమారికి 5ఏళ్ల వయసు వచ్చిన తర్వాత బాసంతి.. తన కంటే తొమ్మిదేళ్ల చిన్నవాడిని ఇష్టపడింది. అతడితో ప్రేమ వ్యవహారం నడిపింది. పరిక్షిత్ ఇంట్లో లేని సమయంలో వారిద్దరూ శారీరకంగా కూడా కలిశారు. ఈ క్రమంలోనే పరిక్షిత్ అడ్డు తొలగించుకునేందుకు ఆమె భారీ స్కెచ్ వేసింది. సెప్టెంబర్ 4న మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి చంపేసింది. ఈ నేపథ్యంలో తండ్రి గంటల కొద్దీ ఉలుకూ పలుకూ లేకుండా మంచంపై ఉండటాన్ని చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు.


ఏమైందంటూ బాసంతిని ప్రశ్నించారు. దీనికి బాసంతి.. ‘మీ నాన్న పడుకున్నాడని’ చెప్పి పిల్లల సందేహం తీర్చింది. ఆ తర్వాత రాత్రంతా భర్త శవం పక్కనే పడుకుని జాగారం చేసింది. మరుసటి రోజు పిల్లలు ఇంట్లో లేని సమయం చూసి, తన ప్రియుడు మనీష్ రావత్(20)ను ఇంటికి రప్పించుకుంది. అతడి సహాయంతో భర్త శవాన్ని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువలో పడేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.



ఈ నేపథ్యంలో గుర్తు తెలియని శవం ఉందంటూ సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. పరిక్షిత్ రావత్ మృతదేహాంగా గుర్తించారు. దీంతో విషయం బాసంతికి తెలియజేశారు. పోస్ట్‌మార్టం తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక.. తాజాగా ఓ రోజు ఈ కేసు వ్యవహారంలో బాసంతిని విచారించేందుకు పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వాళ్లు శాకయ్యారు. భర్త కోల్పోయిన బాసంతి అనందంగా కనిపించడంతో వాళ్లు కంగుతిన్నారు. ఈ క్రమంలోనే ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఈ సందర్భంగా ఆమె వద్ద రెండు ఫోన్లు..10 సిమ్ కార్డులను గుర్తించి విస్తుపోయారు. అనంతరం ఆమె కాల్ రికార్డును పరిశీలించి.. తమదైన స్టైల్‌లో బాసంతిని విచారించారు. దీంతో ఆమె నిజం ఒప్పుకుంది. తన భర్తను తానే హత్య చేసి.. మృతదేహాన్ని తన ప్రియుడు సహాయంతో కాలువ వద్ద పడేసినట్టు అంగీకరించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. 




Updated Date - 2021-10-26T19:22:38+05:30 IST