మానసిక ఒత్తిడి కారణంగా భార్యను దగ్గరకు రానీయని భర్త.. అనుమానం వచ్చిన భార్య.. చివరకు విచారించగా..

ABN , First Publish Date - 2022-05-29T22:11:23+05:30 IST

ప్రస్తుత హైటెక్ యుగంలో భార్యభర్తల మధ్య ప్రేమ, అనురాగం క్రమంగా దూరమవుతోంది. ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బయటి సమస్యలను..

మానసిక ఒత్తిడి కారణంగా భార్యను దగ్గరకు రానీయని భర్త.. అనుమానం వచ్చిన భార్య.. చివరకు విచారించగా..

ప్రస్తుత హైటెక్ యుగంలో భార్యభర్తల మధ్య ప్రేమ, అనురాగం క్రమంగా దూరమవుతోంది. ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బయటి సమస్యలను ఇంటి వరకూ తీసుకొచ్చి, ఆ కోపం మొత్తాన్ని కుటుంబ సభ్యుల మీద చూపించడం నిత్యకృత్యమైంది. మధ్యప్రదేశ్‍‌లో ఓ వ్యక్తి కూడా ఇలాగే మానసిక ఒత్తిడి కారణంగా భార్యను దగ్గరికి రానీయలేదు. చివరకు కసురుకోవడం, ఏదో ఒక సాకు చూపించి దాడి చేయడం చేస్తుండేవాడు. చివరకు ఆమెకు అనుమానం వచ్చి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పరిధిలో నివాసం ఉంటున్న రోహిత్ యాదవ్‌కు ఓ యువతితో 2020 జనవరిలో వివాహమైంది. రోహిత్ తండ్రి మధుసూదన్.. హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం రోహిత్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. శానిటరీ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వివాహమైన మరుసటి రోజు తనకు అనారోగ్యంగా ఉందంటూ భార్యను దగ్గరకు రానీయలేదు. కొద్ది రోజుల తర్వాత రాత్రి భర్త గదికి వెళ్లగా.. మళ్లీ అదే సమాధానం చెప్పి భార్యను దూరం పెట్టాడు. నెలలు గడుస్తున్నా ఏదో ఒక సాకు చెప్పి దగ్గరకు రానీయకపోవడంతో అనుమానం వచ్చి విచారించగా... భర్త నపుంసకుడని తెలిసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ... భర్తను నిలదీసింది.

మొబైల్ షాపు నిర్వాహకుడితో వివాహితకు పరిచయం.. ఉపాధి నిమిత్తం భర్త దూరంగా ఉండడంతో... ఓ రోజు ఏకంగా ఇంటికే పిలిచి..


తన గురించి తెలిసిపోవడంతో భార్యను అదనపు కట్నం పేరుతో నిత్యం వేధించేవాడు. రోజూ ఏదో ఒక సాకు చూపించి వేధిస్తుండడంతో తట్టుకోలేక.. మూడు రోజుల క్రితం విషయం తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నపుంసకుడనే విషయాన్ని దాచి పెట్టి, తనను పెళ్లి చేసుకోవడమే కాకుండా.. అదనపు కట్నం పేరుతో వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. అయితే రోహిత్ తండ్రి రిటైర్డ్ పోలీసు కావడంతో మొదట కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. అయితే విషయం సీరియస్ అవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. రోహిత్, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

నలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..

Updated Date - 2022-05-29T22:11:23+05:30 IST