Advertisement

విమానంలో భర్త అరాచకం.. అతడి చెంప పగలగొట్టిన భార్య!

Oct 25 2020 @ 12:55PM

లండన్: కరోనా కారణంగా మాస్కు మన జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే.. ఇలా మాస్కును నిరంతరం ధరించడాన్ని వ్యతిరేకించే వారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వారు. కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య కూడా ఈ విషయంలో అభిప్రాయబేధాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఓ జంట కారణంగా ఓ విమనాంలో కలకలం రేగింది. మాస్కు పెట్టుకోకుండా అరాచకం సృష్టిస్తున్న భర్తను ఓ భార్య అందరి ముందూ చెంప చెళ్లుమనిపించింది.  బ్రిటన్‌లోని ఈజీజెట్ సంస్థకు చెందిన విమానంలో సెస్టెంబర్ 6న ఈ ఘటన జరిగింది. 

 

విమానం టేకాఫ్ చేసిన కొద్ది సేపటికి ఓ వ్యక్తి తన లొల్లి ప్రారంభించాడు. అందరూ మాస్కులు తొలగించాలని, కరోనాను చూసి భయపడొద్దంటూ నానా యాగీ చేశాడు. తొటి ప్రయాణికుల చేత బలవంతంగా మాస్కు తీయించే ప్రయత్నం చేశాడు. విమానం సిబ్బంది కల్పించుకున్నప్పటికీ అతడు తన మంకు పట్టును వీడ లేదు. ఇదంతా చూస్తున్న అతడి భార్యకు ఒక్కసారి తిక్కరేగింది. నోరుమూసుకుని కూర్చో.. సన్నాసీ అంటూ భర్తపై అంతెత్తున లేచింది. అక్కడితో ఆగకుండా అతడి లాగి పెట్టి చెంప ఛెళ్లుమనిపించింది. వారి వెనకాల సీటులో కూర్చున్న ఓ వ్యక్తి ఈ మొత్తం ఉదంతాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. 

మాంచెస్టర్ నుంచి టెనెరిఫీకి వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే..భార్య చేసిన పనికి మరింతగా రెచ్చిపోయిన భర్త తిరిగి ఆమెపై చేయి చేసుకున్నాడని తొటి విమానప్రయాణికులు తెలిపారు. కాగా..దీనిపై అప్పటికప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామని, విమానం ల్యాండ్ అవగానే వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

Follow Us on:
Advertisement

ప్రత్యేకంమరిన్ని...