గంటల తరబడి ఫోన్ మాట్లాడుతున్న భర్త.. అనుమానంతో వెంటపడిన భార్య.. హోటల్ గదిలో షాకింగ్ సీన్!

Jul 22 2021 @ 19:40PM

ఇంటర్నెట్ డెస్క్: గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతున్న భర్తపై ఆమెకు అనుమానం వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారు? అని అడిగిన ప్రతిసారీ భర్త మాట దాటవేయడం ఆమె అనుమానాన్ని మరింత బలపరిచింది. ఈ క్రమంలో ఆయన్ను చాలా రోజులు వెంబడించిన భార్యకు.. తన భర్త ఒక హోటల్ గదిలో ఉన్నట్లు తెలిసింది. తన సోదరులకు వెంట బెట్టుకొని అక్కడకు వెళ్లిన భార్యకు షాకింగ్ దృశ్యం కనిపించింది. తన భర్త పరాయి స్త్రీతో నగ్నంగా కనిపించాడు. అంతే ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భర్తను, అతని ప్రియురాలిని చావబాదింది. ఈ ఘటన మొత్తాన్ని కెమెరాలో బంధించిన ఆమె.. సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్టు చేయడంతో అవి వైరల్ అయిపోయాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది.


దొరికిపోయిన తర్వాత భార్యకు షాక్

ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ఘటన తర్వాత సదరు ప్రియురాలే పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. జోధ్‌పూర్‌లో టీచర్‌గా పని చేస్తున్న తాను సీఆర్‌పీఎఫ్‌లో ఆఫీసర్‌గా ఉన్న ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ‘‘నేను లివ్-ఇన్ పార్టనర్‌తో ఉండగా అతని భార్య మా గదిలో చొరబడింది. మాస్టర్ కీతో తలుపులు తీసి నగ్నంగా ఉన్న మా వీడియోలు తీసింది. ఆ తర్వాత దాడి చేసింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీస్తోంది. ఇవి మా బంధువులు, పరిచయస్థుల వరకూ వెళ్లాయి. దీని వల్ల నా పరువంతా పోతోంది.’’ అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...