
ఒక యువకుడు శృంగారం కోసం భార్యను పైశాచికంగా హింసించేవాడు. ఆమె ఆరోగ్యం బాగాలేకపోయినా వదిలేడే వాడు కాదు. పైగా ఆమెను చిత్రహింసలు పెట్టేందుకు ప్రకృతికి విరుద్ధంగా శృంగారం చేసేవాడు. భర్త పెట్టే హింసను భరించలేక చివరికి సహనం నశించి ఆమె ఒకరోజు ఏం చేసిందంటే..
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని భరత్పూర్ నగరంలో జీతేంద్ర సైనీ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అతడి భార్యే అతడిని హత్య చేసిందని మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీతేంద్ర హత్య కేసు విచారణ కోసం పోలీసులు జీతేంద్ర భార్య దీపని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఎంత ప్రశ్నించినా దీప నోరు విప్పలేదు. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గమనించిన పోలీసులు మానసిక వైద్యులు సహాయం తీసుకున్నారు.
ఒక మానసిక వైద్యుడి పర్యవ్యేక్షణలో దీపను ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానాలు విని ఆమె కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు కూడా షాకయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. దీప భర్త జీతేంద్ర ఒక సైకో. అతను రోజూ శృంగారం కోసం ఒక మృగంలా ప్రవర్తించేవాడు. శృంగారం సమయంలో ఆమెను చితకబాదేవాడు. దీపకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెతో వెనుక నుంచి శృంగారం జరిపేవాడు. ఈ క్రమంలో దీప ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా జీతేంద్ర ఆమెతో ప్రతిరోజూ బలవంతం చేసేవాడు. దీంతో దీప ఆరోగ్యం ఇంకా క్షిణించింది. ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. అయినా జీతేంద్ర కనికరం చూపించేవాడు కాదు.
జీతేంద్ర ఒక పశువు మారిపోయాడు. అతను పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక దీప ఒకరోజు తన భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఒకరోజు రాత్రి జీతేంద్ర ఇంటికి వచ్చి దీపతో మళ్లీ వెనుక నుంచి శృంగారం చేశాడు. ఆ తరువాత జీతేంద్ర భోజనంలో దీప నిద్ర మాత్రలు కలిపింది. జీతేంద్ర నిద్రపోతుండుగా అతని ముఖంపై దిండు పెట్టి అతడికి ఊపిరి ఆడనివ్వకుండా చంపేసింది. ఆ తరువాత కత్తితో భర్త గొంతు కోసింది.
భర్త పెట్టే విపరీతమైన చిత్రహింసలు భరించలేక దీప అతడిని హత్య చేసిందని మానసిక వైద్య నిపుణులు ధృవీకరించారు. దీప కూడా తానే హత్య చేసినట్టు అంగీకరించింది. ప్రస్తుతం దీపకు మానసిక చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.
ఇవి కూడా చదవండి