Jaisalmer: స్నేహితులతో కలిసి భార్యే భర్తను హతమార్చింది..మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన బైకర్ హత్యోదంతం

ABN , First Publish Date - 2021-09-30T14:12:37+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ఎడారిలో మూడేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన బైకర్ అస్బక్ మోన్ కేసులో సరికొత్త విషయాలు...

Jaisalmer: స్నేహితులతో కలిసి భార్యే భర్తను హతమార్చింది..మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన బైకర్ హత్యోదంతం

జైసల్మేర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ఎడారిలో మూడేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన బైకర్ అస్బక్ మోన్ కేసులో సరికొత్త విషయాలు తాజాగా వెలుగుచూశాయి. ఇండియా-బాజా మోటార్‌స్పోర్ట్స్ ర్యాలీకి ముందు 2018 ఆగస్టు 16వతేదీన జైసల్మేర్‌లోని ఎడారిలో 34 ఏళ్ల బైకర్ మోన్ ప్రాక్టీస్ సమయంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ హత్య కేసులో సాక్షాత్తూ బైకర్ మోన్ భార్యతో పాటు అతని స్నేహితుల హస్తముందని రాజస్థాన్ పోలీసులు తేల్చారు. మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌కు ముందు ఎడారిలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోన్ 2018 ఆగస్టు 16 న మరణించాడని పోలీసులు చెప్పారు.


బైకర్ మోన్ ఎడారిలో దారి తప్పిపోయి, డీహైడ్రేషన్ తో మరణించాడని మొదట పోలీసులు భావించి కేసు మూసివేశారు. జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ పాత కేసులను పరిశీలిస్తూ బైకర్ మరణంలో వ్యత్యాసం కనిపించడంతో తిరిగి కేసు తెరచి దర్యాప్తు చేయించారు. ఎడారిలో తప్పిపోయిన భర్త మోన్ ను భార్య సుమేరా పర్వేజ్ అతని స్నేహితులు వెతకలేదని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతోపాటు బైకర్ భార్య సుమేరాతో అతని స్నేహితుల ఫోన్ కాల్ రికార్డులు, వారి ప్రవర్తన ఆధారంగా బైకర్ ది హత్య అని పోలీసులు అనుమానించి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగుచూసింది.


 బైకర్ భార్య సుమేరా, మోన్ స్నేహితులు సంజయ్, విశ్వాస్ లు కలిసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు సంజయ్, విశ్వాస్ లను అరెస్టు చేశారు. సుమేరా పర్వేజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బైకర్ హత్య కేసులో ఈ ముగ్గురితోపాటు సాబిక్, నీరజ్, సంతోష్ లున్నారని వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-09-30T14:12:37+05:30 IST