
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు.. అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లోనే పురుగుల మందు తాగేశాడు.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఆ యువకుడికి ఏడాది క్రితమే వివాహమైంది. కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.. వివాహేతర సంబంధమే వారి మధ్య గొడవలకు కారణమని తెలుస్తోంది.
దామోహ్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడికి ఏడాది క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఆ యువతి వేరే యువకుడితో తరచుగా ఫోన్లో మాట్లాడుతుండేది. ఎప్పుడూ వాట్సాప్ ఛాటింగ్‌లో మునిగి తేలుతుండేది. ఆ విషయమై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఆ వ్యక్తి తన భార్య మొబైల్‌ను తనిఖీ చేశాడు. ఆమె వాట్సాప్ ఛాటింగ్‌లో చాలా అసభ్యకరమైన ఫొటోలు, మెసేజ్‌లు కనిపించాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన భార్య మొబైల్‌ను పగలగొట్టాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు.
ఆ తర్వాత కూడా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. మరో మొబైల్‌తో అవతలి వ్యక్తితో చాటింగ్ కొనసాగించింది. అంతేకాదు తరచుగా భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయేది. భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇవి కూడా చదవండి