జైలులో Wikileaks Founder జూలియన్ అసాంజే వివాహం

ABN , First Publish Date - 2022-03-23T14:29:33+05:30 IST

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన దీర్ఘకాల భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను బుధవారం ఆగ్నేయ లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వివాహం చేసుకోనున్నారు...

జైలులో Wikileaks Founder జూలియన్ అసాంజే వివాహం

లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన దీర్ఘకాల భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను బుధవారం ఆగ్నేయ లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వివాహం చేసుకోనున్నారు.జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులు,ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో కూడిన చిన్న వేడుకలో వివాహం చేసుకోనున్నారు.అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్ల అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్నారు.


 దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఏడు సంవత్సరాలు ఉన్నారు.రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడు అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలిసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. ఈయన 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్ ను కలిశారు. 


Updated Date - 2022-03-23T14:29:33+05:30 IST