పెయిడ్‌ సైట్‌గా వికీపీడియా!

ABN , First Publish Date - 2021-03-20T05:57:13+05:30 IST

వందలు, వేల పేజీల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్న ‘వికీపీడియా’ తన విజ్ఞానాన్ని పెయిడ్‌ చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి

పెయిడ్‌ సైట్‌గా వికీపీడియా!

వందలు, వేల పేజీల సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్న ‘వికీపీడియా’ తన విజ్ఞానాన్ని పెయిడ్‌ చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి.


‘వికీపీడియా’ సమాచారాన్ని ఉచితంగా అందిస్తున్న  ‘వికీమీడియా’ ఇటీవలె తన కమర్షియల్‌ వేదిక ‘వికీ మీడియా ఎంట్రప్రైజ్‌’ను ఆరంభించింది. ఇప్పుడు అదే గూగుల్‌, యాపిల్‌ వంటి పెద్ద కంపెనీలకు ఆర్టికల్స్‌, ఇతర సమాచారాన్ని అమ్ముతుంది. వికీ మీడియా ఫౌండేషన్‌ ఇంతవరకు గ్రాంట్స్‌, విరాళాలతో లాభాపేక్షరహిత సంస్థగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేరుగా అమ్మకాలను ఈ ఏడాది చివర్లో ఆరంభించే అవకాశం ఉంది.


వికీపీడియా ఫౌండేషన్‌కు చెందిన అనుబంధ సంస్థ వికీమీడియా ఎల్‌ఎల్‌సితో ఇప్పటికీ పెద్ద కంపెనీలు తాము చెల్లించాల్సిన రేటు విషయమై చర్చలు జరుపుతున్నాయి.  జూన్‌ నెలలోపు అగ్రిమెంట్లు కూడా కుదరవచ్చు. అయితే ఏయే కంపెనీలు వికీపీడియాతో చర్చలు జరుపుతున్నాయన్న విషయం మాత్రం వెల్లడికాలేదు. అలాగే ఇప్పటి వరకు వికీపీడియా ఉచితంగా అందిస్తున్న సమాచారం అలాగే కొనసాగుతుందని కూడా  ఫౌండేషన్‌ స్పష్టం చేసింది. మొత్తమ్మీద యావత్తు ప్రక్రియ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలోనే ఉంది.

Updated Date - 2021-03-20T05:57:13+05:30 IST