చిరుతపులి దాడిలో అడవిపంది మృతి

Jun 17 2021 @ 00:49AM

కుభీర్‌, జూన్‌ 16 : నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం లోని జాంగాం గ్రామంలో మంగళవారం రాత్రి చిరు తపులిదాడిలో అడవిపంది మరణించింది. బుధవారం ఉదయం గ్రామరైతులు తమ పంట పొలాలకు వెళ్తుండగా మృతి చెందిన అడవిపంది కళేబేరాలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అం దించారు. దీంతో గ్రామంలో రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు. పొలాల్లో ఉన్న తమ పశువులను ఇంటికి తీసుకు వచ్చారు.  అటవీశాఖ అధికారులు గంగారాం, ఇర్ఫానోద్దిన్‌లు సంఘటన స్థలానికి చేరు కొని పరశీలించారు. రైతులెవరు ఆందోళన చెంద వద్దని, పంటల చుట్టు కరెంటు తీగలను పెట్టవద్ద న్నారు.

Follow Us on: