`మన్మథుడు-2` తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న `కింగ్` నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు.
ఇటీవలె రోహతంగ్ పాస్లో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే `వైల్డ్ డాగ్` నిర్మాతలు ఓటీటీలో విడుదలకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ ఏడాది థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చే సంక్రాంతికి భారీ లైనప్ ఉంది. ఈ నేపథ్యంలో `వైల్డ్ డాగ్` నిర్మాతలు తమ సినిమాను నెట్ఫ్లిక్స్తోపాటు థియేటర్లలోనూ ఒకేసారి విడుదల చేయాలనుకుంటన్నారట.