ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మార్చి 12 సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా నటిస్తోన్న ఈ మూవీలో మరో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ డైలాగ్స్ రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.