Colorado లో కార్చిచ్చు కలవరం.. వెయ్యి ఇళ్లు బుగ్గిపాలు!

ABN , First Publish Date - 2022-01-01T18:08:22+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని కొలరాడోను కార్చిచ్చు కలవర పెడుతోంది.

Colorado లో కార్చిచ్చు కలవరం.. వెయ్యి ఇళ్లు బుగ్గిపాలు!

కొలరాడో: అగ్రరాజ్యం అమెరికాలోని కొలరాడోను కార్చిచ్చు కలవర పెడుతోంది. గురువారం నెమ్మదిగా ప్రారంభమైన దావానలం చాలా తక్కువ సమయంలోనే 6వేల ఎకరాలకు విస్తరించింది. దీంతో ఏకంగా వెయ్యి నివాసాలు బుగ్గిపాలు అయ్యాయి. పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిరాశ్రయులైన 35వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన కార్చిచ్చును సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ జరెడ్ పోలీస్ వెల్లడించారు. సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది కుటుంబాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఈ సందర్భంగా గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది దావానలాన్ని కంట్రోల్ చేసేందుకు రేయింబవళ్ళు కష్టపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.    









Updated Date - 2022-01-01T18:08:22+05:30 IST